టీఆర్‌పీ కోసం కాదు అది నిజమే.. సుధీర్‌-రష్మి, `జబర్దస్త్` లవ్‌స్టోరీస్‌పై నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్స్

Published : Mar 11, 2022, 07:25 PM ISTUpdated : Mar 11, 2022, 08:11 PM IST

`జబర్దస్త్` షో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇందులో యాంకర్‌ రష్మి, సుడిగాలిసుధీర్‌ల మధ్య లవ్‌ స్టోరీ కూడా అంతే పాపులర్‌ అయ్యింది. తాజాగా ఈ లవ్‌ స్టోరీస్‌పై నటి ఇంద్రజ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
18
టీఆర్‌పీ కోసం కాదు అది నిజమే.. సుధీర్‌-రష్మి, `జబర్దస్త్` లవ్‌స్టోరీస్‌పై నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్స్

`యమలీల` చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది నటి ఇంద్రజ(Indraja). ఈ సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆమె వరుసగా పలుక్రేజీ ప్రాజెక్ట్ ల్లో చేసింది. ఎక్కువగా స్టార్‌ హీరోలతో చేయకపోయినా చిన్నచిత్రాలతోనైనా సక్సెస్‌ అందుకుంది. చాలా గ్యాప్‌ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఆ మధ్య `జబర్దస్త్` షోలో జడ్జ్ గా మెరిసింది. ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. 

28

మరోవైపు నటి ఇంద్రజ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా బిజీ అవుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఆమె రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ కలిసి నటించిన `స్టాండ్‌ అప్‌ రాహుల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో తల్లి పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా మార్చి 18న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా `జబర్దస్త్ షో` గురించి, అందులోని లవ్‌ ట్రాక్‌ల గురించి, టీవీ షోస్‌ గురించి పలు సీక్రెట్స్ ని బయటపెట్టింది. 

38

టీవీ షోస్ లో జరిగేదంతా స్క్రిప్టెడ్‌ అంటుంటారు. కానీ అది తప్పని తాను తెలుసుకున్నానని చెప్పింది ఇంద్రజ. అందులో రియల్‌ ఎమోషన్స్ ఉంటాయని, టీఆర్‌పీ కోసం కాదని చెప్పింది. అంతకు ముందు ఊరికే టీఆర్‌పీల కోసం ఇలా కావాలని చేస్తారని తాను అనుకున్నానని, కానీ అందులో పనిచేశాక అసలు విషయం అర్థమైందని పేర్కొంది ఇంద్రజ. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో ఉన్నప్పుడు వచ్చే కంటెస్టెంట్లు రియల్‌గా స్టేజ్‌పై ఏడుస్తుంటారని, వారి బాధలు చెప్పుకుని ఎమోషనల్‌ అయిపోతుంటారని, వాటిలో లీనమై మనం కంట్రోల్‌ చేసుకోలేమని, దీంతో కొన్నిసార్లు తాము కూడా ఎమోషనల్‌ అయిపోతామని పేర్కొంది. ఈ సందర్భంగా చాలా మాటలు చెబుతామని, కానీ అన్నీ ఎడిటింగ్‌లో పోతాయని పేర్కొంది. 

48

కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుందని, చాలా వరకు చాలా ఫన్‌, కామెడీగా షోస్‌ సాగుతాయని, నవ్వుతూ, నవ్విస్తూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని, టీవీ షోస్‌ తనకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయని పేర్కొంది. బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపింది.  `జబర్దస్త్`లో కొన్ని రోజులు వర్క్ చేశాక తనకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడిందని, తన నవ్వుకు చాలా మంది ఫిదా అవుతున్నారని, మళ్లీ రావాలని కోరుకుంటున్నారని తెలిపింది ఇంద్రజ. 

58

ఈ సందర్భంగా `జబర్దస్త్`లో లవ్‌ స్టోరీస్‌పై స్పందించింది. రష్మి-సుధీర్‌, జబర్దస్త్ కామెడీయన్ల మధ్య లవ్‌ ట్రాక్‌లో నిజమెంతా అనే ప్రశ్నకి ఇంద్రజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారి మధ్య లవ్‌ స్టోరీస్‌ అనేవి వారి వ్యక్తిగతమని, తాను వాటి గురించి మాట్లాడలేనని పేర్కొంది. వాటిని పట్టించుకోనని పేర్కొంది. అయితే మనం వారి మధ్య లవ్‌ ఉందని అంటే లేదన్నయ్య అని వెళ్లిపోతారని, కానీ నిజమేంటనేది తెలియదు. చూసే ఆడియెన్స్ మాత్రం తాము చూసిందే నమ్ముతారు. ఈ విషయంలోనూ ఆడియెన్స్ ఏం నమ్ముతారు, ఏం ఆలోచిస్తున్నారనేది వారికే వదిలేయాలని తెలిపింది ఇంద్రజ. 

68

ఇక `స్టాండ్‌ అప్‌ రాహుల్‌` చిత్రం గురించి చెబుతూ, ప్రేమని, రిలేషన్‌, భార్యభర్తల మధ్య సమస్యలను, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ని గత తరం ఎలా డీల్‌ చేస్తుందని, ఇప్పటి తరం ఎలా డీల్‌ చేస్తుందనే దానిపై సాగుతుందని చెప్పింది. తమ కలలు, పర్సన్‌ జీవితానికి మధ్య నేటి తరం ఎలా స్ట్రగుల్‌ అవుతుందనేది తెలియజేస్తుందని చెప్పింది. నేటి తరం మేకర్స్, నటీనటులు చాలా క్లారిటీతో వస్తున్నారని, చాలా ఫాస్ట్ గా ఉన్నారని తెలిపారు. 

78

క్యారెక్టర్‌ ఆర్టిస్టులను స్టీరియోటైప్‌ చేసేస్తున్నారని, దీంతో తనకు కెరీర్‌ పరంగా గ్యాప్‌ వస్తుందని పేర్కొంది. మహిళా పాత్రలకు ప్రయారిటీ ఉండటం లేదని చెప్పింది. ఈ విషయంలో మార్పు రావాలని తెలిపింది. హీరోకి ఆరవై ఏళ్లు వచ్చినా హీరోగానే చూస్తారని, కానీ హీరోయిన్లని మాత్రం పెళ్లైన తర్వాత హీరోయిన్‌గా చూడటం లేదని, దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ లుగా మారిపోవాల్సి వస్తుందని ఆవేదన చెందింది. 
 

88

అయితే మన ఇండియన్‌ కల్చర్‌లో మహిళలని ఈ సమాజం పెళ్లి అయి పిల్లలు పుట్టాక తల్లిగా గౌరవిస్తుందని, అలా గౌరవించి చక్కటి తల్లి పాత్రలకు, అక్క పాత్రలకు పిలవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. అయితే `ఇప్పుడు చాలా మంది పెళ్లైన హీరోయిన్స్ కూడా సినిమాలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌. నేను పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా దృష్టి పెట్టా. పాప పుట్టాక తనకి ఎనిమిదేళ్లు వచ్చే వరకు తన ఆలనాపాలనానే చూసుకున్నాను. నేను అలానే అనుకున్నాను కాబట్టి ఆ విషయంలో అసంతృప్తి లేద`ని చెప్పింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పింది ఇంద్రజ. వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తున్నట్టు పేర్కొంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories