Kajal Agarwal: భర్తతో రొమాంటిక్‌ ఫోటో పంచుకున్న కాజల్‌.. క్రైమ్‌ పార్టనర్‌ అంటూ ఎమోషనల్‌ పోస్ట్..

Published : Aug 17, 2022, 04:02 PM ISTUpdated : Aug 17, 2022, 06:39 PM IST

అందాల చందమామ కాజల్‌ భర్తపై ప్రేమని పంచుకుంటోంది. గౌతమ్‌ కిచ్లు సందర్భంగా లేటెస్ట్ గా ఓ ఎమోషనల్‌ పోస్ట్ ని షేర్‌ చేసింది. భర్తని క్రైమ్‌ పార్టనర్‌గా చేయడం విశేషం.   

PREV
16
Kajal Agarwal: భర్తతో రొమాంటిక్‌ ఫోటో పంచుకున్న కాజల్‌.. క్రైమ్‌ పార్టనర్‌ అంటూ ఎమోషనల్‌ పోస్ట్..

కాజల్‌(Kajal) రెండేళ్ల క్రితం ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు(Gautam Kitchlu)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మ్యారేజ్‌ తర్వాత భర్త గౌతమ్‌ కిచ్లు రెండో బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది కాజల్‌. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. 

26

భర్త మెడపై చెయ్యేసి ఆయన్ని చూస్తూ నవ్వులు పూయించారు. ఎంతో రొమాంటిక్‌గా ఉన్న ఫోటోని షేర్‌ చేసింది కాజల్‌. ఈ సందర్భంగా ఆయన బర్త్ డే (Gautam Birthday)విషెస్‌ తెలిపింది. ఎమోషనల్‌ నోట్‌ని పంచుకుంది. భర్తని తన క్రైమ్‌ పార్టనర్‌గా వర్ణించడం విశేషం. 
 

36

కాజల్‌ చెబుతూ, `నేరంలో నా భాగస్వామి, నా బీఎఫ్‌ఎఫ్‌, ఉదయం మూడు గంటలకు, అర్థరాత్రి 12గంటలు, ఇప్పుడు,ఎప్పటికీ మీ హృదయం కోరుకునే ప్రతి దానితో సంతోషకరమైన బర్త్ డే జరుపుకోండి హ్యాపీ బర్త్ డే గౌతమ్‌ కిచ్లు అని పేర్కొంది కాజల్‌. ఈ సందర్బంగా లవ్‌ ఎమోజీని పంచుకుంది. 

46

ఇందులో స్లీవ్‌ లెస్‌ పింక్‌ ఫ్రాక్‌లో మెరిసిపోతుంది కాజల్‌. కాస్త బొద్దుగా ఎంతో అందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె అందం రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా దిగిన ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పిచ్చెక్కించే పోజులతో కనువిందు చేస్తుంది కాజల్‌. 

56

అంతకు ముందు కాజల్‌ భర్తకి కిస్‌ ఇస్తూ పంచుకున్న ఫోటో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. బర్త్ డే విషెస్‌ చెబుతూ, భర్త నుదురుపై ఓ బ్యూటీఫుల్‌ కిస్‌ ఇచ్చింది కాజల్‌. చేతిలో కుమారుడు నీల్‌ని పట్టుకుని దిగిన ఈ ఫోటో ట్రెండ్‌ అయ్యింది. ఇప్పుడు మరో పిక్‌తో ఆద్యంతం కట్టిపడేస్తుంది. 

66

కాజల్‌ నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చిన తర్వాత వెంటనే రెగ్యూలర్‌ లైఫ్‌లోకి వచ్చేసింది. ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. తన అందం ఏమాత్రం తరగలేదనే విషయాన్ని నిరూపించుకుంటోంది. గ్లామర్‌ ఫోటో షూట్‌తో ఆకట్టుకుంటుంది. అంతేకాదు త్వరలో ఆమె `ఇండియన్‌ 2` షూటింగ్‌లోనూ పాల్గొనబోతుందని సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories