చెక్కు చెదరని కాజల్‌ అందం.. లేటెస్ట్ లుక్‌లో హంటింగ్‌.. కొడుకు అల్లరి గురించి ఎమోషనల్‌ పోస్ట్..

Published : Oct 24, 2022, 09:31 AM IST

తెలుగుతెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ తల్లైన తర్వాత గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటుంది. తన అందం ఏమాత్రం చెక్కు చెదరలేదనే విషయాన్ని ఫోటో షూట్లతో చాటుకుంటుంది.   

PREV
17
చెక్కు చెదరని కాజల్‌ అందం.. లేటెస్ట్ లుక్‌లో హంటింగ్‌.. కొడుకు అల్లరి గురించి ఎమోషనల్‌ పోస్ట్..

కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా అందాల విందు చేసింది. రెట్టింపు హాట్‌ షోతో మైండ్‌ బ్లోయింగ్‌ చేసింది. ఇటీవల ఆమె కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఆమె తిరిగిన తన వర్క్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. వరుసగా తనఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. తన ఫిట్‌నెస్‌ ని చాటుకుంటుంది. 
 

27

ఇప్పటికీ తన అందం చెక్కు చెదరలేదనే విషయాన్ని తెలియజేస్తుంది కాజల్‌. తాజాగా ఓ పెయిడ్‌ ప్రమోషన్‌ యాడ్‌ వీడియోలోనూ ఆమె ఎంతో అందంగా ఉంది. అంతేకాదు ఇప్పుడు ఆమె హాట్‌ నెస్‌ మరింత పెరగడం విశేషం. ఇలా చూసిన అభిమానులు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందాల చందమామ ఎప్పుడూ చందమామలానే ఉంటుందంటున్నారు.
 

37

ఇదిలా ఉంటే ఇటీవల కాజల్‌ తన మాతృత్వానికి సంబంధించిన ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. నీల్ కిచ్లుతో గడిపిన, గడుపుతున్న మధుర క్షణాలను, ఆ అల్లరిని గుర్తు చేసుకుంది. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతుంది. ఇందులో కాజల్‌ చెబుతూ, నీల్‌ పుట్టి అప్పుడే ఆరు నెలలు అవుతుందంటే నమ్మలేకపోతున్నానని తెలిపింది. 
 

47

`నువ్వు పుట్టి అప్పుడే ఆరు నెలలవుతోంది. కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో, ఓ తల్లిగా నీ విషయంలో నేను మొదట చాలా భయపడ్డాను. ఓ తల్లిగా నా కార్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలనా అనిఅనుకున్నా. గొప్ప తల్లి ఎలా అవ్వాలో ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. నాకు ఎన్ని పనులున్నా, నీ కోసం సమయాన్ని కేటాయిస్తూనే ఉంటా. 
 

57

నీపై శ్రద్ధ చూపడంలో ఎక్కడా రాజీపడను. నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటా. ఇది నాకు సవాలుతో కూడుకున్నదే అయినా, నేను పొందే ఆనందం ముందు ఆ ఛాలెంజ్‌ కూడా చిన్నదే అనిపిస్తుంది. నువ్వు రాత్రిపూట చేసే అల్లరి నాకు సంతోషాన్నిస్తుంది. నేను మీ నాన్న కలిసి నీ గురించి సరదాగా మాట్లాడుకుంటుంటాము. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను గుర్తు పెట్టుకుంటా. నీకు జన్మనిచ్చే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నీ మొదటి బర్త్ డేకి ఇంకా సగం దూరం ఉంది. మై లవ్‌, మై బేబీ నీల్‌` అని పేర్కొంది కాజల్‌. 
 

67

ఈ సందర్భంగా తనయుడు నీల్‌కి సంబంధించిన ఆమె ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో ఆ చిన్నారి తన నుదుటిపై చేయి వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఎంతో క్యూట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 

77

కాజల్‌ చివరగా `హే సినామిక` చిత్రంలో నటించింది. ఇది పరాజయం చెందింది. తెలుగులో చేసిన `మోసగాళ్లు` ఆడలేదు. `ఆచార్య`లో చిరంజీవితో చేయగా, అది ఎడిటింగ్‌లోనే తీసేయడం గమనార్హం. ఇప్పుడు ఆమె `భారతీయుడు 2`లో నటిస్తుంది. మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తుంది. అందుకే హాట్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాజల్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories