Kajal Pregnancy Trolling: యాడ్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన కాజల్‌.. సమంత విషెస్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌..

Published : Jan 07, 2022, 11:17 PM IST

కాజల్‌ ప్రెగ్నెన్సీని కొత్త ఏడాది సందర్భంగా ప్రకటించారు ఆమె భర్త గౌతమ్‌కిచ్లు. తాజాగా కాజల్‌ సైతం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. కానీ ఆమె చెప్పిన విధానం ఇప్పుడు ట్రోల్‌ కి కారణమవుతుంది. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

PREV
16
Kajal Pregnancy Trolling: యాడ్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన కాజల్‌.. సమంత విషెస్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌..

కాజల్‌ అగర్వాల్‌.. ఏడాది తర్వాత గర్భం దాల్చింది. 2020 అక్టోబర్‌లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుంది. అయితే రెండు మూడు నెలలుగా కాజల్‌ గర్భవతి కాబోతుందనే వార్తలుఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన ఆమె సరైన సమయంలో దీని గురించి మాట్లాడతానని తెలిపింది. కానీ కొత్త ఏడాది సందర్భంగా ఆమె భర్త గౌతమ్‌ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీని ప్రకటించాడు. ఈ ఏడాదితో తమ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. 
 

26

అయితే దాదాపు వారం రోజుల తర్వాత ఈ విషయంపై స్పందించింది కాజల్‌. శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. `ఈ ఏడాది నా చిన్నారిని కలవడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రెగా న్యూస్‌ ఈ విషయాన్ని ఖచ్చితంగా, వేగవంతంగా నాకు తెలియజేసింది. నా ప్రెగ్నెన్సీ జర్నీ సరైన మార్గంలో ప్రారంభమైందని నేను నమ్ముతున్నా. దీన్ని ఎందుకు ఎంచుకున్నానో తెలియజేయడానికి వీడియో` చూడండి అంటూ ఓ వీడియోని పంచుకుంది కాజల్‌. 
 

36

ఇందులో ఆమె ప్రెగా న్యూస్‌ అనే ప్రెగ్నెన్సీ కిట్‌ ప్రకటన ఉంది. ఈ ప్రెగ్నెన్సీ కిట్‌ ద్వారా తాను ఎంత కచ్చితమైన ప్రెగ్నెన్సీ సమాచారం తెలుసుకుందో తెలిపింది కాజల్‌.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. తమ అభిమాన నటి ప్రెగ్నెన్సీ అనే వార్తతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు స్పందించి విషెస్‌ తెలియజేస్తున్నారు. సమంత, లావణ్య త్రిపాఠి,నిషా అగర్వాల్ వంటి వారు విషెస్‌ చెప్పారు. అందమైన క్యూటీ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. చాలా ప్రేమ మీకు కాజల్‌` అనితెలిపింది సమంత. ఈ పోస్ట్‌ సైతం చక్కర్లు కొడుతుంది. 

46

ఇదిలా ఉంటే ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు, సెలబ్రిటీలు  కాజల్‌కి అభినందనలు తెలియజేస్తూ ఆనందాన్ని వెల్లడిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ కాజల్‌ ప్రకటించిన విధానమే ఇప్పుడు వివాదంగా మారుతుంది. నెటిజన్ల ఆగ్రహానికి, ట్రోల్స్ కి కారణమవుతుంది. 
 

56

ప్రెగ్నెన్సీ అనేది ఓ తల్లికి ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. గొప్ప అనుభూతి. దాన్ని ఎంతో స్పెషల్‌గా ప్రకటిస్తుంటారు. ఆ విషయాన్ని పూర్తిగా వారి వ్యక్తిగతంగా భావిస్తుంటారు. కానీ కాజల్‌ మాత్రం దాన్ని బిజినెస్‌గా మార్చుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాజల్‌ ఓ ప్రకటన రూపంలో తనప్రెగ్నెన్సీని తెలపడం పట్ల నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 

66

వ్యాపారానికి అడ్డు అదుపు ఉండక్కర్లేదా? చివరికి ఓ గొప్ప అనుభూతిని కూడా వ్యాపారం చేసేస్తారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బు కోసం ఇలా మారిపోతారా? అంటూ విమర్శలు గుప్పించడం గమనార్హం. కాజల్‌ ప్రెగా న్యూస్‌ అనే ప్రెగ్నెన్సీ కిట్‌ని ప్రమోట్‌ చేస్తూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించడం ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories