ప్రతిరోజు ఆ ఐదు నిమిషాలు నరకం చూస్తా... కాజల్ కి అప్పటి నుండే ఈ సమస్య ఉందట!

First Published Mar 17, 2021, 9:28 AM IST

స్టార్ డమ్, కోట్ల సంపాదన, మంచి లైఫ్ కాజల్ అగర్వాల్ అనుభవిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె. ఎంత స్టార్ హీరోయిన్ అయినా వారికి ఉండే సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటి ఓ సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. 

కాజల్ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 13ఏళ్ళు అవుతుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్... టాప్ స్టార్స్ హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు.
undefined
గత ఏడాది అక్టోబర్ లో కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. నచ్చిన వాడిన పెళ్లాడిన కాజల్... మ్యారీడ్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
undefined
అయితే పెళ్లి తరువాత కూడా ఆమె ఇమేజ్ ఇంచ్ కూడా తగ్గలేదు. పెళ్లికి ముందు ఒప్పుకున్న ఆచార్య, భారతీయుడు 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో ఉన్న కాజల్ కొత్త ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తున్నారు.
undefined
తాజా ఇంటర్వ్యూలో ఆమె తన కొత్త ప్రాజెక్ట్స్ సంబంధించిన డిటైల్స్ వివరించారు. కింగ్ నాగార్జునతో ఓ మూవీ చేస్తున్నట్లు కాజల్ చెప్పడం విశేషం.
undefined
ఈ మధ్య విడుదలైన వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్ లో కాజల్ భిన్నమైన రోల్ చేశారు. సిగరెట్, ఆల్కహాల్ తాగుతూ అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపించారు.
undefined
ఈ సిరీస్ కి మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పిన కాజల్, మరో వెబ్ సిరీస్ చేయనున్నట్లు చెప్పడం విశేషం.
undefined
కాగా కాజల్ చిన్నప్పటి నుండి తనను వేధిస్తున్న ఓ సమస్యను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రతి ఉదయం నిద్ర లేవడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందట. ఎరుపెక్కిన నిద్ర కళ్ళతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటారట.
undefined
నిద్ర మత్తునుండి తేరుకొని బెడ్ దిగే ఆ ఐదు నిముషాలు తనకు నరకం కనిపిస్తుందని కాజల్ తెలియజేశారు. స్కూల్ కి వెళ్లే ఏజ్ లో రెడీ చేయడానికి వాళ్ళ అమ్మ నిద్ర లేపేవారట.. అప్పుడు ఆ బాధ దారుణం అంటున్నారు ఆమె.
undefined
నిజానికి కాజల్ అనుభవించే ఈ సమస్య అందరికీ ఉండేదే... పేరెంట్స్ నిద్ర లేపుతుంటే ఇంకొంచెం సేపు పడుకోవాలని అనిపించడం సర్వసాధారణం.
undefined
ఇక కాజల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు ఈ వారం విడుదల కానుంది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడం విశేషం.
undefined
పెళ్ళైనా కూడా కాజల్ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. పెళ్లి తరువాత హీరోయిన్స్ కెరీర్ గ్రాఫ్ పడిపోతుందని అందరూ భావిస్తారు.. కానీ కాజల్ మరింత జోరు  పెంచింది.
undefined
click me!