నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులని ఎంజాయ్ చేస్తున్నాను. అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా. గర్భవతి అయ్యాక శరీరంలో హార్మోనుల వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. బాడీ తల్లి అయ్యేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతూ ఉంటుంది. ఫలితంగా బరువు పెరగడం సహజం అని కాజల్ పేర్కొంది.