ఎవడో ఫోన్ చేశాడని రాంచరణ్ మూవీలో క్యారెక్టర్ లేపేశారు.. నడిరోడ్డులో నిలబడాల్సిన పరిస్థితి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 09, 2022, 10:35 AM IST

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సంపాదించింది ఏమి లేదని అన్నారు.

PREV
16
ఎవడో ఫోన్ చేశాడని రాంచరణ్ మూవీలో క్యారెక్టర్ లేపేశారు.. నడిరోడ్డులో నిలబడాల్సిన పరిస్థితి

కమెడియన్ పృథ్వీ టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా బాగా పాపులర్ అయ్యారు. చాలా చిత్రాల్లో పృథ్వీ చేసిన కామెడీ రోల్స్ ప్రేక్షకులని మెప్పించాయి. కమెడియన్ గా పృథ్వీ ఎంత పాపులర్ అయ్యారో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడాయి. ముఖ్యంగా పృథ్వీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన్ని ఎక్కువగా వివాదాలు వెంటాడాయి. 

26

2019 సార్వత్రిక ఎన్నికల్లో పృథ్వీ వైసీపీకి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వైసిపి అధికారంలోకి వచ్చాక పృథ్వీకి ఎస్వీబిసి చైర్మన్ పదవి దక్కింది. కానీ పృథ్వీ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకోవడం వల్ల ఆ పదవి కోల్పోవలసి వచ్చింది. తిరిగి ఇప్పుడు పృథ్వీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 

36

ఖడ్గం, అత్తారింటికి దారేది, లౌక్యం, బాబు బంగారం లాంటి చిత్రాలు పృథ్వికి మంచి గుర్తింపునిచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సంపాదించింది ఏమి లేదని అన్నారు. కరోనా వల్ల తాను చావుబతుకుల పరిస్థితిలోకి వెళ్లాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న మా అబ్బాయి డబ్బు పంపడం వల్ల సేవ్ అయ్యా. 

46

గతంలో నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ పిలిచి మరో సినిమాలో కూడా ఛాన్స్ ఇస్తున్నా.. చేయాలి అని అంటారు. దీనితో మొహమాటం వల్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేం. వాళ్లు ఇచ్చింది తీసుకోవాలి. అలా మొహమాటంలో చాలా సినిమాలు చేశా. వాళ్లని వీళ్ళని నమ్ముకుని నడిరోడ్డులో నిలబడిపోయే పరిస్థితి వచ్చింది అని పృథ్వి అన్నారు. 

56

చాలా సినిమాల్లో నా పాత్ర ఉన్నప్పటికీ ఎడిటింగ్ లో లేపేశారు. ఉదాహరణకు రాంచరణ్ రంగస్థలం మూవీ. ఆ మూవీలో నాది చాలా మంచి పాత్ర. డబ్బింగ్ కూడా చెప్పాను. కానీ సినిమాలో నా రోల్ లేదు. ఎవడో ఫోన్ చేసి చెప్పాడట.. అంతే నా పాత్ర లేపేశారు. దాని గురించి రాంచరణ్ ని నేను ఏమీ అడగలేదు. ఆ తర్వాతే వినయ విధేయ రామలో నటించా అని పృథ్వి పేర్కొన్నారు. 

66

అలాగే బాలకృష్ణ సినిమాలో ఒక రోల్ కోల్పోయా. ఇంగ్లీష్ రాకపోవడం కూడా నాకు కొంత మైనస్ అని పృథ్వీ అన్నారు. అయినప్పటికీ నాకు తెలిసిన దర్శకులని అవకాశాలు అడుగుతున్నా. అందులో తప్పులేదు. ఆచార్యలో నటించాలనుకున్నా.. కానీ అవకాశం రాలేదు అని పృథ్వీ తెలిపారు. 

click me!

Recommended Stories