ఎన్టీఆర్ కి తప్పిన పెను ప్రమాదం... ఇండియాకు రాకపోతే పరిస్థితి ఏమయ్యేదో?

Published : Jan 02, 2024, 11:34 AM IST

హీరో ఎన్టీఆర్ పెను ప్రమాదం నుండి తృటిలో తప్పుకున్నారు. ఆయన జపాన్ భూకంపంలో చిక్కుకునేవారు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ అవుతుంది.   

PREV
16
ఎన్టీఆర్ కి తప్పిన పెను ప్రమాదం... ఇండియాకు రాకపోతే పరిస్థితి ఏమయ్యేదో?

ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ ఇచ్చి జపాన్ వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ జపాన్ దేశం వెళ్లారు. వారం రోజులకు పైగా జపాన్ దేశంలో గడిపారు. 

 

26

వెకేషన్ ముగించుకున్న ఎన్టీఆర్ కుటుంబం ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ ఇండియాకు ఫ్లైట్ ఎక్కిన కొన్ని గంటల్లోనే జపాన్ లో భూకంపం సంభవించింది. పదుల సంఖ్యలో మనుషులు మరణించారు. 7.6 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. సునామీ తీర ప్రాంతాన్ని ముంచెత్తింది. 

36

ఈ భూకంపంపై ఎన్టీఆర్ స్పందించారు. జపాన్ లో సంబంధించిన భూకంపం దిగ్బ్రాంతికి గురి చేసింది. ఒక వారం రోజులు అక్కడే గడిపాను. జపాన్ త్వరగా కోలుకోవాలి. మీ పోరాట పటిమకు ధన్యవాదాలు... అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. 

46

ఎన్టీఆర్ గంటల వ్యవధిలో భూకంప ప్రమాదం నుండి తప్పుకున్నారు. ఆయన ఇండియాకు బయలుదేరకుంటే... మొత్తం కుటుంబం భూకంపంలో చిక్కుకునేవారు. ఎన్టీఆర్ కుటుంబం సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 

 

56

ఎన్టీఆర్ కి జపాన్ దేశం అంటే ఇష్టం. ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలు వాళ్ళు చూస్తారు. ఇక ఆర్ ఆర్ ఆర్ నెలల తరబడి అక్కడ ఆడింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. 

66


మరోవైపు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories