తన జీవితాన్ని మార్చిన ఆ ముగ్గురు డైరెక్టర్ల గురించి కాజల్ కామెంట్స్.. ఎవరెవరో తెలుసా..

First Published May 26, 2024, 1:14 PM IST

ఓ ఇంటర్వ్యూలో కాజల్ తనకి ఇష్టమైన ముగ్గురు డైరెక్టర్ల గురించి చెప్పింది. కాజల్ తన కెరీర్ లోతేజ ,  వంశీ, వివి వినాయక్, సుకుమార్, రాజమౌళి, శ్రీనువైట్ల, కరుణాకరన్, పూరి జగన్నాధ్, మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసింది. కానీ ఆమెకి మాత్రం ముగ్గురు డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం అని ఆ ముగ్గురే తన జీవితాన్ని మార్చారని పేర్కొంది.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సూపర్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. త్వరలో కాజల్ సోలో హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఈ చిత్రం మే 31న కానీ జూన్ 7న కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ రానుంది. కాజల్ మాత్రం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కరుడుకట్టిన క్రిమినల్స్ తో పోరాడే పవర్ ఫుల్ కాప్ పాత్రలో నటిస్తోంది. 

పోలీస్ అధికారిగా నటిస్తూ కాజల్ అన్ని ఎమోషనల్స్ పండిస్తోంది. మర్డర్ వెనుక ఉన్న మిస్టరీలని చేధించేందుకు ఎంత రిస్క్ అయినా తీసుకునే పోలీస్ అధికారిగా కాజల్ నటిస్తోంది. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సత్యభామ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కాజల్ ప్రతి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తోంది. 

ఓ ఇంటర్వ్యూలో కాజల్ తనకి ఇష్టమైన ముగ్గురు డైరెక్టర్ల గురించి చెప్పింది. కాజల్ తన కెరీర్ లోతేజ ,  వంశీ, వివి వినాయక్, సుకుమార్, రాజమౌళి, శ్రీనువైట్ల, కరుణాకరన్, పూరి జగన్నాధ్, మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసింది. 

కానీ ఆమెకి మాత్రం ముగ్గురు డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం అని ఆ ముగ్గురే తన జీవితాన్ని మార్చారని పేర్కొంది. ఆ ముగ్గురు ఎవరో కాదు డైరెక్టర్ తేజ, కృష్ణ వంశి, రాజమౌళి. మొట్టమొదటగా కాజల్ డైరెక్టర్ తేజ పేరు చెప్పింది. నన్ను చిత్ర పరిశ్రమకి పరిచయం చేసింది ఆయనే. కెమెరాని ఫేస్ చేయడం కూడా తెలియదు. నాకు నటనలో ఓనమాలు దిద్దించింది ఆయనే అని కాజల్ తెలిపింది. తేజ తెరకెక్కించిన లక్ష్మి కళ్యాణం చిత్రంతో కాజల్ హీరోయిన్ గా పరిచయం అయింది. 

ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి, సీత చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కృష్ణ వంశీ.. ఆయన దర్శకత్వంలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నా. చందమామ చిత్రం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అలాగే గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కూడా కాజల్ కృష్ణ వంశి డైరెక్షన్ లో నటించింది. ఆ తర్వాత రాజమౌళి.. సినిమా భారీ తనం అంటే ఏంటో ఆయన దర్శకత్వంలోనే తెలిసింది అని కాజల్ పేర్కొంది. ఈ ముగ్గురు దర్శకుల వల్ల తన లైఫ్ మారిపోయింది అని కాజల్ తెలిపింది. 

click me!