అభిమానులకు అందాల పరీక్ష పెడుతున్న కాజల్‌.. రీఎంట్రీకి గట్టి ప్లాన్‌. బట్‌ కండీషన్స్ అప్లై?

Published : Jun 13, 2022, 04:50 PM IST

అందాల చందమామ కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఇటీవల ప్రెగ్నెన్సీ కారణంగా గ్యాప్‌ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుందా? లేటెస్ట్ గా ఆమె పంచుకుంటున్న గ్లామర్ ఫోటోలు చూస్తుంటే నిజమే అంటున్నారు. 

PREV
17
అభిమానులకు అందాల పరీక్ష పెడుతున్న కాజల్‌.. రీఎంట్రీకి గట్టి ప్లాన్‌. బట్‌ కండీషన్స్ అప్లై?

కాజల్‌ అగర్వాల్ (Kajal) రెండు నెలల క్రితం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఓ వైపు చిన్నారి కుమారుడిని చూసుకుంటూనే అప్పుడే కెరీర్‌పై దృష్టిపెడుతుందట కాజల్‌. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. 
 

27

అయితే డెలివరీ టైమ్‌లో ఇక కాజల్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందని, పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని, వ్యక్తిగత జీవితంపైనే ఫోకస్‌ పెట్టాలని, ఫ్యామిలీ, వ్యాపారాలు చూసుకోవాలని ఫిక్స్ అయినట్టు వార్తలొచ్చాయి. కానీ లేటెస్ట్ పరిణామాలు చూస్తుంటే కాజల్‌ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుందని తెలుస్తుంది. 
 

37

ఇటీవల వరుసగా కాజల్‌ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. గర్భవతి కారణంగా ఆమె కాస్త బరువెక్కింది. నాజుకూ తనం పోయింది. దీంతో మళ్లీ నాజూకుగా మారేందుకు కష్టపడుతుందట, వర్కౌట్స్  చేస్తూ పూర్వఅందాన్ని పొందాలని భావిస్తుందట కాజల్‌. అయితే ఇటీవల ఆమె పంచుకున్న హాట్‌ ఫోటోలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. (తన కుమారుడు నీల్‌ కిచ్లుతో కాజల్‌).

47

ఇందులో కాజల్‌ తన అందం ఏమాత్రం తరగలేదు సరికదా, మరింత పెరిగింది. మరింత హాట్‌గా కనిపిస్తుంది కాజల్‌. ఆ మధ్య వరుసగా ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుని మేకర్స్ కి సిగ్నల్ ఇస్తుంది. తాను ప్రెగ్నెన్సీకి ముందులాగే ఉన్నానని, అందం, హాట్‌ నెస్‌ ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. 
 

57

స్విమ్మింగ్‌ పూల్‌లో పిక్‌ని పంచుకుని షేక్‌ చేసింది కాజల్‌. మరోవైపు ఇప్పుడు మరో కొత్త ఫోటోని పంచుకుంది. ఇందులో మరింతగా ఆకట్టుకుంటుందీ భామ. అందం రెట్టింపయ్యిందనే విషయాన్ని చాటి చెబుతుంది. వైరల్‌ అవుతుంది. 
 

67

కాజల్‌ చివరగా `హే సినామికా` చిత్రంలో నటించింది. ఇది విడుదలై పరాజయం చెందింది. చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటించగా, చివరికి ఆమె పాత్రని తొలగించారు. మరోవైపు నాగార్జునతో `దిఘోస్ట్` మూవీలో నటించాల్సి ఉండగా, దాన్నుంచి కూడా తప్పుకుంది. ప్రెగ్నెన్సీ కారణంగానే ఆయా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. 
 

77

ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తుందట. అయితే గతంలో మాదిరిగా కాకుండా, తనకు వయసుకి, మ్యారేజ్‌ అయిన కారణంగా దానికి తగ్గ హుందాతనంతో కూడిన పాత్రలే చేయాలనుకుంటుందట. గ్లామర్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. తనకు ఫ్యామిలీ, కుమారుడు ఉన్నారు. దీంతో గ్లామర్‌ విషయంలో కండీషన్స్ పెడుతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories