అసలు సురేఖ అతని భార్య కావాల్సింది... ఆ నటుడు సలహాతో చిరంజీవికి కట్టబెట్టిన అల్లు రామలింగయ్య!

Published : Jun 13, 2022, 03:48 PM ISTUpdated : Jun 13, 2022, 03:50 PM IST

ఒక నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క మంచి సలహా పెనుమార్పులు తీసుకువస్తుంది. అలా ఓ నటుడి సలహా చిరంజీవి-సురేఖల వివాహం జరిగేలా చేసింది. చిరంజీవి-సురేఖ పెళ్ళికి ముందు జరిగిన తతంగం తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

PREV
110
అసలు సురేఖ అతని భార్య కావాల్సింది... ఆ నటుడు సలహాతో చిరంజీవికి కట్టబెట్టిన అల్లు రామలింగయ్య!

అయితే చిరంజీవి పెళ్లి చూపుల‌కు నేనెందుకు రావ‌డం మీరు చూడండి చాలు అని అన్నాడ‌ట‌. దానికి చిరంజీవి త‌ల్లిదండ్రులు ఒప్పుకోకుండా చిరంజీవిని కూడా తీసుకెళ్లార‌ట‌. అయితే సురేఖ చిరంజీవిని.. `మ‌న‌వూరి పాండవులు` ప్రివ్యూ వేసిన‌ప్పుడు, `త‌యార‌మ్మ బంగార‌య్య` శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల్లో చూసి ఉండ‌టంతో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జ‌రిగిపోయింది.

210

నటుడిగా కనీస గుర్తింపు రాకముందే అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడు చేసుకున్నారు. సురేఖ మేడలో తాళి కట్టే నాటికి చిరంజీవి చిన్నా చితకా పాత్రలు, చిత్రాలు చేస్తున్నారు. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి నటుడిగా మారాడు. ఆయన నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది.

310

చిరంజీవిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు. ఎప్పటికైనా స్టార్ అవుతాడనే నమ్మకం చిరంజీవి మీద అల్లు రామలింగయ్యకు కలిగింది. దీంతో చిరంజీవిని పిలిచి సురేఖను వివాహం చేసుకుంటావా? అని అడిగారట. 
 

410


అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. గీతా ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. డబ్బు, హోదా స్టేటస్ లో అల్లు రామలింగయ్య ఎక్కడో ఉన్నారు. అయినా ఓ సాధారణ వర్ధమాన హీరోకి కూతుర్ని ఇవ్వాలనుకున్నాడు. అల్లు రామలింగయ్య ప్రతిపాదన చిరంజీవికి షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఆయనఆనందంగా ఒప్పుకున్నారు. 

510


కానీ అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం. నేను చేస్తున్న పని కరెక్టేనా, అని చిన్న పీకులాట ఉంది. మరో వైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. అదే సమయానికి ఓ కలెక్టర్ సురేఖను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట. నటుడు చిరంజీవికి ఇవ్వాలా సెటిల్డ్ పోజిషన్ లో ఉన్న కలెక్టర్ కి ఇవ్వాలనే మీమాంసలో పడ్డారట. 

610


అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిశారట. సురేఖ పెళ్లి విషయంలో ఆయన సలహా కోరారట. ''ఏమండి రెడ్డిగారూ... ఇలా రెండు సంబంధాలు వచ్చాయి . చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరోవైపు కలెక్టర్ సంబంధం ఉంది. ఇద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది'' అని అడిగారట. 

710

అల్లు రామలింగయ్య ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి నేరుగా సమాధానం చెప్పారట. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండదు. అందుకే సురేఖనే అడుగు,  అమ్మాయి ఇష్టప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చాడట.

810

ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు సురేఖను అడుగగా... ఆమె చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట. అమ్మాయి ఒప్పుకుందే తడవుగా అల్లు రామలింగయ్య ఇద్దరికీ వివాహం నిశ్చయించారు. 1980 ఫిబ్రవరి 20న అనేక మంది చిత్ర ప్రముఖుల సమక్షంలో చిరంజీవి-సురేఖల వివాహం జరిగింది.

910

ఒక వేళ సురేఖ కలెక్టర్ ని చేసుకొని ఉంటే సమీకరణాలు వేరుగా ఉండేవి. చిరంజీవి స్టార్ గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మామ కోసం ఆ బ్యానర్ లో చిరంజీవి అనేక చిత్రాలు చేశారు. చిరంజీవి-గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 
 

1010


అదే సమయంలో అల్లు రామలింగయ్య అల్లుడయ్యాక చిరంజీవికి పరిశ్రమలో ఎదగడానికి మార్గం సుగమం అయ్యింది. అల్లు రామలింగయ్య  కారణంగా చిరంజీవికి ఆఫర్స్ వచ్చాయి. ఆ అవకాశాలను తన టాలెంట్ తో విజయాలుగా మలిచి చిరంజీవి స్టార్ అయ్యారు. చిరంజీవి-సురేఖ పెళ్లికి ముందు జరిగిన ఈ వ్యవహారాన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి భార్య ఓ సందర్భంలో బయటపెట్టారు. 
 

click me!

Recommended Stories