ఇక సినిమాలు బంద్, కాజల్ షాకింగ్ నిర్ణయం,మనసు మార్చుకోమంటున్న అభిమానులు

Published : May 05, 2022, 12:27 PM IST

టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.  తెలుగు ఆడియన్స్ కు తన గ్లామర్ డోస్ తో ఘాటు అందాలు చూపించిన ఈ భామ.. ఇక సినిమాలకు దూరం అయినట్టే అంటున్నారు.   

PREV
18
ఇక సినిమాలు బంద్, కాజల్ షాకింగ్ నిర్ణయం,మనసు మార్చుకోమంటున్న అభిమానులు

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చిన్న హీరోల దగ్గర నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోల వరకూ అందరితో నటించి మెప్పించింది. ఆమె హీరోయిన్ గా నటించిన  వాటిలో కొన్ని సినిమాలు తప్పించి.. దాదాపు ఎక్కువ సినిమా సూపర్ సక్సెస్ అయినవే. 

28

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. తన స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి పెళ్ళాడింది. ఇక వీరిద్దరికి రీసెంట్ గా ఓ మగబిడ్డ కూడా పుట్టాడు. దాంతో ఫుల్ ఖుషీగా ఉంది కాజల్ అగర్వాల్. తన గారాల కొడుక్కి కాజల్ నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టుకుంది బ్యూటీ. 

38

ఇక ఈ టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఓ  సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆమె భావిస్తోందట. ఈ విషయాన్ని అధికారికంగా ఆమె ప్రకటించకపోయినప్పటికీ... కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 

48

ఇకపై ఫ్యామిలీని చూసుకోవడానికి, తన తనయుడికే మొత్తం టైమ్ ను కేటాయించాలని కాజల్ భావిస్తోందట. సినిమాలలో నటిస్తే కొడుకుని చూసుకోవడానికి సమయం ఉండదనే ఆలోచనతో... పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే నిర్ణయానికి కాజల్  వచ్చిందని సమాచారం.

58

గతంలో కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా పెళ్లయిన తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే స్టార్ డమ్ లో కాని.. సినిమా అవకాశాలలో కాని కాజల్ రేంజ్ వేరు. కాజల్ కు     ఇంకా కొన్నేళ్లు సినిమాలు చేసుకునే అవకాశం ఉంది. ఆమెకు డిమాండ్ కూడా ఉంది. 
 
 

68

అసలు ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమవుతుంటారు. తమ కుటుంబాలను చూసుకోవడం కోసం వారు సినీ కెరీర్ కు ముగింపు పలుకుతారు. పిల్లలు పెద్దయిన తర్వాత అవకాశాలు వస్తే... సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. కాజల్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. 
 

78

ఇక  ఈ వార్త విన్న కాజల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ  ఫేవరెట్ నటి ఇకపై తెరపై  కనిపించదని తెలిసి తెగ బాధపడుతున్నారు. కాజల్ తన అభిప్రాయాన్ని మార్చుకుని మళ్ళీ నటించాలని వారు కోరుతున్నారు. అంతే కాదు కాజల్ మనసు మార్చుకుంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
 

88

అయితే ఇప్పటి వరకూ ఆమె అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు.  కాజల్ సన్నిహితుల నుంచి మాత్రం సమాచారం అందుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన ఆచార్యలో కూడా కాజల్ ను తీసేశారు. అటు కమల్ తో  భారతీయుడు2 నుంచి కూడా కాజల్ తప్పుకుంది. ఇలా కొన్ని సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. 
 

click me!

Recommended Stories