ఆ తర్వాత కైకాల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విలన్ పాత్రలతో నట విశ్వరూపం ప్రదర్శించారు. యస్వీ రంగారావుకి ప్రత్యామ్నాయం అని ప్రశంసలు అందుకున్నారు.పౌరాణికం, జానపదం ఎలాంటి పాత్రల్లో అయిన జీవించేవారు కైకాల. ముఖ్యంగా టాలీవుడ్ వెండి తెరపై యముడు అంటే కైకాల మాత్రమే గుర్తు వచ్చేవారు. కైకాల, స్వర్గీయ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది.