jyotika: ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేలా నటి జ్యోతిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు...ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆమె బహిరంగంగానే సపోర్ట్ చేసినట్లు కనిపిస్తోంది.
నటి జ్యోతిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు ఆమె బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. విద్యార్థుల పక్షాన నిలుస్తున్నా.. అంటూ పోస్ట్ పెట్టారు.
25
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్
తన పోస్టులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు తాను సపోర్టు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థులు దేశవ్యాప్తంగా వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, విద్యా విధానంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
35
మా పిల్లలు మీలాగే ధైర్యంగా ఉండాలి
జ్యోతిక తన పోస్టులో ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్ వంటి ఉద్యమకారులను అభినందిస్తూ, తమ పిల్లలు మీలాగే ధైర్యంగా, నిజాయితీగా ఎదగాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అని పేర్కొన్నారు. యువత భయపడకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని ఆమె అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, "We are India" అంటూ రాసుకొచ్చారు. మీరు ఒత్తిడిని ఛేదించారు... మాలో భయాన్ని తొలగించారు అంటూ విద్యార్థుల ధైర్యాన్ని జ్యోతిక ప్రశంసించారు. చివర్లో "జై హింద్" అంటూ తన పోస్టును ముగించారు. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిక పోస్టుపై విద్యార్థులు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండగా...మరికొందరు విమర్శిస్తున్నారు.
55
ఉద్యమానికి తెలపలేను
ప్రస్తుతం విద్యార్థుల ఉద్యమానికి, సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు, విద్యా వ్యవస్థలో సంస్కరణల డిమాండ్‌కు పలువురు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అయ్యారు. కానీ సింగర్ అరిజిత్ సింగ్ మాత్రం ఉద్యమానికి తెలపలేనంటూ డైరెక్ట్ గానే చెప్పేశారు.