ఎన్టీఆర్ నటించిన దేవర చిత్ర కలెక్షన్స్ నిజమా ఫేకా అనే చర్చ ఇప్పటికీ టాలీవుడ్ లో జరుగుతూనే ఉంది. విపరీతమైన నెగిటివ్ టాక్ లో కూడా దేవర అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనిపై ఓ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటించిన మరో పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇది రెండు భాగాలుగా తెరకెక్కాల్సిన చిత్రం. దేవర పార్ట్ 1 విజయం సాధించింది. అయినప్పటికీ దేవర 2 గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దేవర పార్ట్ 1 కలెక్షన్స్ పై ఇప్పటికీ టాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంది.
25
నెగిటివ్ టాక్ తో భారీ కలెక్షన్లు
దేవర చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ 500 కోట్ల గ్రాస్ గా నమోదయ్యాయి. ఇదెలా సాధ్యం అయింది అంటూ తీవ్రంగా చర్చ జరిగింది. దేవర కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారం కూడా ఉంది. దీనిపై నాగవంశీ అనేక సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ డిస్కషన్ ఆగలేదు. అంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ దేవర కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఎలా నమోదయ్యాయి అనేది అందరి ప్రశ్న.
35
నెగిటివ్ టాక్ నిజమే కానీ
దీనిపై ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దేవర చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 3 ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ గా రిలీజ్ చేశారు. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. దేవర చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. దీనితో మేము కంగారు పడ్డాం. ఎందుకంటే చాలా భారీ మొత్తానికి సినిమాని కొన్నాం. కానీ తొలి రోజు అన్ని ఏరియాలలో ప్రతి షో హౌస్ ఫుల్ అయింది. దీనితో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ రెండవ రోజు నుంచి కూడా దేవర చిత్రం స్టడీగా కలెక్షన్స్ మైంటైన్ చేసింది. దీనికి కారణం జనరల్ ఆడియన్స్. సినిమాలో కొన్ని చోట్ల డల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ జనరల్ ఆడియన్స్ కి నచ్చింది. అది దసరా సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తరలివచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు అయితే రిపీట్ గా చూశారు. అందుకే నాలుగు వారాల పాటు దేవర కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి అని ధీరజ్ అన్నారు.
55
దుబాయ్ లో సక్సెస్ పార్టీ
దుబాయ్ లో నాగవంశీ పార్టీలు నిజమేనా అని ప్రశ్నించగా.. అవును అని సమాధానం ఇచ్చారు. నాగవంశీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని దేవర చిత్రాన్ని కొన్నారు, రిలీజ్ చేశారు. నెగిటివ్ టాక్ లో కూడా కలెక్షన్స్ వచ్చాయి అంటే ఆ కిక్ ఉంటుంది కదా.. అందుకే ఆయన దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు అని ధీరజ్ తెలిపారు.