Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే

Published : Jul 25, 2026, 12:44 PM IST

చిరంజీవి, కృష్ణం రాజు లాంటి వారి బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అండదండలు ఉన్నప్పటికీ ఈ హీరోల తొలి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
16
Chiranjeevi

టాలీవుడ్ లో వారసత్వం ప్రధానంగా ఉంది. అది కాదనలేని నిజం. చాలా మంది స్టార్ హీరోల వారసులు, కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో హీరోలుగా, నటీమణులుగా రాణిస్తున్నారు. స్టార్ హీరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే తొలి చిత్రంపై విపరీతమైన బజ్ ఉంటుంది. అంతటి క్రేజ్ ఉన్నప్పటికీ ఈ హీరోల తొలి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ బలమైన బ్యాగ్రౌండ్ వర్కౌట్ కాలేదా.. ఆ చిత్రాలు అసలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాబితాలో ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఉన్నారు.

26
ప్రభాస్ - ఈశ్వర్

కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ కి కృష్ణంరాజు పెదనాన్న. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు నిర్మాత కూడా. ఇంతటి బలమైన బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ డిజాస్టర్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం రొటీన్ కథే అని చెప్పాలి. ప్రేమ కథ అయినప్పటికీ ఎక్కడా సినిమాలో ఫ్రెష్ గా అనిపించే సీన్లు ఉండవు. తొలి చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత ప్రభాస్ వర్షం మూవీతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు.

36
పవన్ కళ్యాణ్ - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి తమ్ముడు అనే ఇమేజ్ కూడా ఈ చిత్రాన్ని రక్షించలేకపోయింది. ఇది హిందీ చిత్రం ఖయామత్ సే ఖయామత్ తక్ కి రీమేక్. అక్కడ జరిగిన మ్యాజిక్ ఈ చిత్రంలో రిపీట్ కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్యాలెంట్ కి గుర్తింపు దక్కింది.

46
జూనియర్ ఎన్టీఆర్ - నిన్ను చూడాలని

నందమూరి తారకరామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ మూవీలో ఓవర్ ఎమోషనల్ సీన్స్ అప్పటి తారక్ ఏజ్ కి సెట్ కాలేదు. రొటీన్ లవ్ స్టోరీ కావడంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు.

56
అఖిల్ అక్కినేని - అఖిల్

నాగార్జున తనయుడిగా, అక్కినేని వారసుడిగా అఖిల్ పదేళ్ల క్రితమే 'అఖిల్' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఈ చిత్రంలో అఖిల్ వయసుకి మించిన భారీ కథ ఉండడమే పెద్ద మైనస్ అయింది. భారీ బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ వర్కౌట్ కాలేదు.

66
రవితేజ - నీ కోసం

రవితేజకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. అయినప్పటికీ రవితేజ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం నీకోసం మూవీ ఫ్లాప్ అయింది. చాలా నెమ్మదిగా సాగే కథ, వినోదం లేని సన్నివేశాలు ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణం అయ్యాయి. కానీ ఇడియట్ తో క్రేజ్ వచ్చాక రవితేజ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగారు.

Read more Photos on
click me!

Recommended Stories