ఒళ్ళు గగుర్పొడిచేలా జ్యోతిక జిమ్ ఫీట్లు, చూస్తే హార్ట్ బీట్ రైజ్..మేడం మీ భర్తకి కూడా కష్టమే

Published : May 01, 2023, 11:53 AM IST

సూర్య, జ్యోతిక లవ్లీ కపుల్ గా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. 2006లో సూర్య, జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లో రాణిస్తున్నారు. 

PREV
17
ఒళ్ళు గగుర్పొడిచేలా జ్యోతిక జిమ్ ఫీట్లు, చూస్తే హార్ట్ బీట్ రైజ్..మేడం మీ భర్తకి కూడా కష్టమే

సూర్య, జ్యోతిక లవ్లీ కపుల్ గా ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. 2006లో సూర్య, జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లో రాణిస్తున్నారు. 

27

సూర్య సౌత్ లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. మ్యారేజ్ తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. 

37

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలని జ్యోతిక ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు జ్యోతిక తెలుగులో మాస్, ఠాగూర్ లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. అయితే ప్రస్తుతం జ్యోతిక వయసు 44 ఏళ్ళు. ఈ వయసులో కూడా జ్యోతిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ కాపాడుకుంటోంది.

47

తాజాగా జ్యోతిక తన వర్కౌట్ వీడియో షేర్ చేయగా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా జ్యోతిక జిమ్ ఫీట్స్ చేస్తూ హార్ట్ బీట్ రైజ్ చేస్తోంది. జ్యోతిక చేస్తున్న జిమ్ వర్కౌట్స్ ఎంతో రిస్క్ తో కూడు కున్నవిగా ఉన్నాయి. తలక్రిందులుగా జ్యోతిక చేస్తున్న వర్కౌట్స్ కి సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. 

57

కొన్ని సందర్భాల్లో స్కిప్ అయి జ్యోతిక పడిపోవడం కూడా ఈ దృశ్యాల్లో చూడచ్చు. కానీ ఏమాత్రం బెదురు లేకుండా జ్యోతిక మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆమె చేస్తున్న వర్కౌట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

67

యాషిక ఆనంద్, దియా మీనన్ లాంటి సెలెబ్రిటీలు సెల్యూట్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీ భర్త సూర్య కూడా ఇలాంటి ఫీట్లు చేయలేరేమో అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

77

ఇదిలా ఉండగా హీరో సూర్య ప్రస్తుతం డైరెక్టర్ శివ దర్శకత్వంలో కంగువ అనే హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరహాలో ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. 

 

click me!

Recommended Stories