ప్రపంచ యాత్రను సగంలోనే ముగించిన పాప్ సింగర్, ఆందోళనకరంగా జస్టిన్ బీబర్ ఆరోగ్యం

Published : Sep 07, 2022, 02:11 PM ISTUpdated : Sep 07, 2022, 02:16 PM IST

ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. నిర్విరామంగా సాగుతున్న తన జస్టిస్ వరల్డ్ టూర్ ను ఆయన రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. కాని ఆయన పరిస్థితి గురించి విని ఆందోళన చెందుతున్నారు.   

PREV
17
ప్రపంచ యాత్రను సగంలోనే ముగించిన పాప్  సింగర్, ఆందోళనకరంగా జస్టిన్ బీబర్ ఆరోగ్యం

హాలీవుడ్ పాప్ స్టార్  జస్టిన్ బీబర్ తన జస్టిస్ వరల్డ్ టూర్ ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించాడు. అనారోగ్య కారణాల వల్ల ఈ డెసిషన్ తీసుకోవలసి వచ్చినట్టు అభిమానులకు  ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బీబర్ వరల్డ్ టూర్ నిర్విరామంగా  కొనసాగుతున్న వేళ... మధ్యలోనే ఇలా ఆగిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అంతే కాదు అసలు విషయం తెలసుకుని  బీబర్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

27

రామ్సే హంట్ సిండ్రోమ్ బారిన పడ్డానని ఈ ఏడాది ప్రారంభంలోనే బీబర్ వెల్లడించాడు. అంతే కాదు .. దీని వల్ల తన ముఖంలోని కొంత భాగం పెరాలసిస్ కు గురయిందని బీబర్ తెలిపాడు. ఈ కారణం వల్ల జస్టిస్ వరల్డ్ టూర్ లో మిగిలి పోయిన ఉత్తర అమెరికా టూర్ ను పూర్తి చేయలేకపోతున్నానని ప్రకటించాడు. 
 

37

అయితే ఈ విషయం తెలిసిన కొత్తలో డాక్టర్ల సూచన.. ఫ్యామిల మెంబర్స్ ధైర్యంతో.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. యూరప్ టూర్ కు వెళ్లానని ఆయన తెలిపారు. అయితే అక్కడి వెళ్లడం జరిగింది కాని.. యూరప్ లో  ఆరు లైవ్ షోలు చేయడం తనకు మరింత భారంగా అనిపించిందని చెప్పాడు. 

47
हादसे के वक्त जस्टिन कार की पैसेंजर सीट पर थे।

బ్రెజిల్ లోని రియో డిజెనీరోలో చేసిన  షోలో తన ఆరోగ్యం సహకరించలేదన్నారు బీబర్. అయినా సరే తన శక్తిమేర పర్ఫామెన్స్ ఇచ్చానని .... కాని దాని వల్ల  షో పూర్తయిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటకు గురయ్యానని చెప్పాడు. ఈ సంఘటన వల్లనే తనకు ఓ విషయం అర్ధమైందని.. ఈ షోస్ కంటే కూడా ముందు  తన ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే విషయం తనకు అర్థమయిందని తెలిపాడు. 

57

అందుకే తన వరల్డ్ టూర్ కి కొంత కాలం పాటు బ్రేక్ ఇస్తున్నానని చెప్పాడు. ఈ నిర్ణయం వల్ల ప్యాన్స్ బాగా డిస్సాపాయింట్ అవుతారని. కాని తన ఆరోగ్య కుదురుకోవడానికి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం అన్నారు బీబర్. అప్పటి వరకూ తనకు సహకారం అందించాలని ఫ్యాన్స్ ను కోరకున్నారు బీబర్. 

67

జస్టిన్ బీబర్  చాలా చిన్న వయస్సులోనే పాప్ సింగర్ గా స్టార్ డమ్ సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాధించుకున్నాడు బీబర్. ప్రస్తుతం ఆయన జస్టిస్ వరల్డ్ టూర్ ను ఆయన ఈ ఏడాది మార్చిలో ప్రారంభించాడు. అయితే, రామ్సే హంట్ సిండ్రోమ్ కారణంగా జూన్ లో  షోలను రద్దు చేసుకున్నాడు. 

77

తన అనారోగ్యం వల్ల షోస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు బీబర్. తన ముఖం కుడివైపు కదలిక విషయంలో ఇబ్బంది పడుతున్నానని, కన్ను కూడా కొట్టుకుంటోందని, ముక్కుకు సంబంధించిన ఇబ్బంది ఉందని, తన నోరు కుడివైపు నుంచి మాత్రమే కొంత నవ్వగలుగుతున్నానని జూన్ లో ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు జస్టిన్  బీబర్. 

Read more Photos on
click me!

Recommended Stories