Prema Entha Madhuram: ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన అంజలి.. స్టేజ్ మీద నీరజ్ కు ఘోర అవమానం!

Published : Apr 15, 2023, 02:52 PM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటుంది. తమ్ముడి గెలుపు కోసం తపనపడే ఒక అన్న కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Prema Entha Madhuram: ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన అంజలి.. స్టేజ్ మీద నీరజ్ కు ఘోర అవమానం!

ఎపిసోడ్ ప్రారంభంలో నేను ఒక మనిషిని ఇన్స్పైర్ అయ్యి హెల్పింగ్ హాండ్స్ అనే యాప్ ని స్టార్ట్ చేశాను అంటూ స్టేజి మీద ఎమోషనల్  అవుతాడు సూరి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరు అని అడుగుతుంది యాంకర్. ఆ వ్యక్తిని నేను నా కళతో చూపిస్తాను అంటూ ఆర్య బొమ్మని గీయడం ప్రారంభిస్తాడు సూరి.
 

28

తను బొమ్మ గీస్తూ ఉంటే కిందన మాన్సీ టెన్షన్ పడుతూ ఉంటుంది. పూర్తయిన బొమ్మని చూసి అందరూ షాక్ అవుతారు. ఆర్య అయితే అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటే మాస్క్ జారిపోవడం వల్ల సూరి గుర్తుపడతాడు.గబగబా కిందికి వచ్చి ఆర్య అని హత్తుకుని మీ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈ క్రెడిట్ మీదే అంటాడు సూరి.
 

38

ఇందులో నాదేముంది మీ కృషి, పట్టుదల మిమ్మల్ని ఈ స్టేజ్ లో నిలబెట్టాయి అంటాడు ఆర్య. ఇదంతా చూస్తున్న అంజలి ఆనందే ఆర్య వర్ధనా అంటూ షాక్ లో ఉండిపోతుంది. కలో నిజమో తెలియక నీరజ్ ని అడుగుతుంది. అవును ఆయనే ఆర్య వర్ధన్ నా దాదా మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తాను అంటాడు నీరజ్. మినిస్టర్ గారు ఆర్యని స్టేజ్ మీదకి రమ్మంటారు.
 

48

ఆర్య స్టేజ్ మీదకు వెళ్ళిన తర్వాత స్టేజికే కళ వచ్చింది అంటాడు మినిస్టర్. తర్వాత అవార్డులు అనౌన్స్ చేస్తుంది యాంకర్. ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ క్యాటగిరిలో అంజలికి అవార్డు వస్తుంది. స్టేజి మీదకి వెళ్ళిన అంజలి అవార్డు అందుకున్న తర్వాత అసలు ఈ రంగంలో ఇంట్రెస్ట్ లేకుండా అడుగు పెట్టాను కానీ ఈరోజు ఈ స్టేజ్ కి వచ్చానంటే అందుకు ఒక స్నేహం నాకు అడుగడుగునా తోడైంది అంటూ ఆర్య ని చూస్తూ చెప్తుంది.
 

58

థాంక్యూ ఆర్య సర్ అంటుంది. నేను ఎప్పుడూ మీ ఆనంద్ నే మేడం అంటాడు ఆర్య. ఆ తరువాత డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ కేటగిరీలో నీరజ్ కి అవార్డు వస్తుంది. అవార్డు తనకి రాలేనందుకు కోపంతో రగిలిపోతుంది మాన్సీ. అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఆర్య చేతుల మీదుగా  అవార్డు అందుకుంటాడు నీరజ్.
 

68

అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు కంగ్రాట్స్ అంటూ మినిస్టర్ మెచ్చుకుంటాడు. అవార్డు ఇస్తూ ఐ యాం వెరీ ప్రౌడ్ అఫ్ యు అంటూ తమ్ముడిని మెచ్చుకుంటాడు ఆర్య. మరోవైపు పోలీసులు నీరజ్ ని వెతుక్కుంటూ  ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తారు అక్కడ ఎవరినో నీరజ్ గురించి ఎంక్వయిరీ చేస్తారు.
 

78

నీరజ్ కూడా తన అన్న గురించి స్టేజి మీద గొప్పగా మాట్లాడుతాడు. ఒక గోల్ లేకుండా లైఫ్ ని ఈజీగా  గడిపేస్తున్న నాకు నా అన్న ఇన్స్పిరేషన్ వల్ల ఇక్కడి వరకు రాగలిగాను అంటూ ఎమోషనల్ అవుతాడు. అవార్డు తీసుకొని కిందకి దిగబోతుంటే అప్పుడే జ్యూరీ మెంబర్ కి ఒక వ్యక్తి వచ్చి చెవిలో ఏదో చెప్తాడు. జ్యూరీ మెంబర్ నీరజ్ ని ఆగమని ఆ అవార్డుని వెనక్కి ఇచ్చేయమని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకు ఏమైంది అని అడుగుతాడు మినిస్టర్. 

88

 రాంగ్ పర్సన్ కి అవార్డు ఇవ్వడం జరిగింది అనే జ్యూరీ మెంబర్ అంటే ఏం మాట్లాడుతున్నారు అంటాడు ఆర్య. అవన్నీ మీరు పోలీసులతో మాట్లాడుకోండి అంటూ ఈ అవార్డుని మదన్ కి ఇస్తున్నట్టుగా ప్రకటిస్తుంది జ్యూరీ మెంబర్. ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు నీరజ్. మదన్ దయచేసి స్టేజ్ మీదకి రండి రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చినందుకు సారీ ఈ అవార్డుకి మీరే కరెక్ట్ పర్సన్ అంటూ స్టేజి మీదకి ఆహ్వానిస్తుంది జ్యూరీ మెంబర్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories