పేదల కోసం ఉపాసన సాయం.. మెగా కోడలిపై నెటిజన్ల ప్రశంసలు.. ఏంచేశారంటే?

First Published | Apr 15, 2023, 2:32 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి  ఉపాసన కొణిదెల (Upasana Konidela) సేవా గుణంతో ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఓ ట్రస్టుకు తన ఎర్నింగ్స్ ను డోనేట్ చేశారు. 
 

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా ఉపాసన కొణిదెల అందరికీ సుపరిచితమే. మెగా కోడలిగా ఉపాసన అందరి మన్ననలను పొందుతున్నారు. అయితే ఆమె ఇప్పటికే పలు రకాలు సాయం అందిస్తూ ఉదారతను చాటుకున్న విషయం  తెలిసిందే. 
 

తాజాగా పేదల కోసం ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో హౌస్ ఆఫ్ టాటా నుండి Zoya కొత్త స్టోర్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరై గోల్డ్ స్టోర్ ను లాంచ్ చేశారు. తద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను  ఉపాసన పేదల కోసం ఉపయోగించారు. 


ఆ రెమ్యూనరేషన్ ను దోమకొండ పోర్ట్, విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్ట్ కు విరాళంగా అందించారు. ట్రస్టు ద్వారా అణగారిన, వెనకబడిన వారిని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించారు.  వహిళా సాధికారతకు, పిల్లల చదువులకు ఆ డబ్బు ఉపయోగపడేందుకు డోనేషన్ ఇచ్చారు. 

అంతే కాదు స్టోర్ యాజమాన్యం ఆమెకు బహుమతిగా అందించిన ఖరీదైన ఈయర్ రింగ్స్ ను కూడా ట్రస్ట్ కే అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఉపాసన మెగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు చరణ్ వైఫ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇందుకు ఉపాసన కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేసింది. దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (DFVDT) చొరవ ద్వారా మహిళల సాధికారత కోసం సహకరించిన జోయాకు  ఆమె ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. జోయా స్టోర్ హస్తకళ, రకరకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 
 

త్వరలో మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇవ్వబోతున్న ఉపాసన ఇలా సేవా గుణంతో ప్రశంసలు అందుకుంటున్నారు. రీసెంట్ గా దుబాయ్ లో ఉపాసన సీమంతం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఆ వెంటనే భర్త చరణ్ తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు కూడా వెళ్లారు. 
 

Latest Videos

click me!