మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండకు పొగరెక్కువా...? కెమెరా ముందు మాత్రమే మర్యాదగా నటిస్తారా?

First Published | Jun 9, 2024, 9:23 PM IST

మహేష్ బాబు.. జూనియర్ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఈ ముగ్గురికి పొగరు ఎక్కువా...? కెమెరా ముందే మంచిగా నటిస్తారా..? ఓ బాలీవుడ్ స్టార్ చేసిన వ్యాక్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి విషయం ఏంటంటే..? 

ఇండియాతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాది తారల హవా నడుస్తోంది.  పాన్ ఇండియా పేరుతో బాలీవుడ్ నటులను డామినేట్ చేస్తూ.. మనవాళ్లు స్టార్లుగా ఎదిగారు. అయితే మొదటి నుంచి ఓ  పేరు ఉంది.  దక్షిణాది నటీనటులు చాలా నిరాడంబరంగా, నిశ్శబ్దంగా ఉంటారని, బాలీవుడ్ తారలు అహంకారంతో ఉంటారని వారకి చెడ్డపేరు ఉంది. అయితే బాలీవుడ్ సెలబ్రిటీ  పాపారాజీ మాత్రం  ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. దక్షిణాది నటుల ప్రవర్తనపై షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 

అవును, సెలబ్రిటీ ఛాయాచిత్రకారులు వరీందర్ చావ్లా సౌత్ స్టార్స్ గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసారు. సౌత్ స్టార్స్ చాలామంది కేవలం కెమెరాల ముందు మర్యద నటిస్తారని.. నిజజీవితంలో చాలా పొగరుగా ఉంటారన్నట్టు ఆయన కామెంట్  చేశారు. అయితే వారిలో ముఖ్యంగా  తెలుగు స్టార్లు విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను ఆయన ఉదాహణగా చెప్పారు. 
 


యూట్యూబ్ ఛానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన చావ్లా, 'నిజాయితీగా ఉండాల్సిన వారు బయట కూడా నటిస్తున్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. కెమెరా కోసమే ఇలా వ్యవహరిస్తాడు. అందులో విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ టైమ్ లో మీడియాతో వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు. 

అంతే కాదు రీసెంట్ గా  జూనియర్ ఎన్టీఆర్ తనను ఫాలో అవుతున్న జనాలపై  కోప్పడగా..ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సంఘటన గురించి చావ్లా మాట్లాడుతూ, 'ఇటీవల, మా బృందం సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉండే దక్షిణాదికి చెందిన ఒక పెద్ద స్టార్ వీడియోను తీశాము. అతను హోటల్ లోపలికి వెళ్తున్నాడు.. ఆటైమ్ లో తన వెంట వచ్చిన మీడియా మిత్రులను  దుర్భాషలాడాడు. కాని ఈ వీడియోను నేను పోస్ట్ చేయలేదు' అని ఆయన అన్నారు. చావ్లా RRR స్టార్ పేరు చెప్పలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గురించే అని టాక్. 
 

చివరగా, వరీందర్ చావ్లా మహేష్ బాబును టార్గెట్ చేస్తూ,  మాట్టాడారు. మేజర్ ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు, మహేష్ బాబు మాకు బాలీవుడ్ అవసరం లేదు అన్నట్టు ప్రవర్తించారని.. తాను టాలీవుడ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను అన్నట్టుగా ప్రవర్తించాడని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!