జాన్వీ కపూర్ షాక్ అయ్యేలా.. జూనియర్ ఎన్టీఆర్ విందు. ఏం చేశారో తెలుసా..?

Published : Aug 01, 2024, 05:39 PM ISTUpdated : Aug 01, 2024, 05:50 PM IST

జాన్వీకపూర్ కు అదరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆమె ఇంతవరకూ చూడలేని.. కనీవినీ ఎరుగని విందును ఏర్పాటు చేశాడు.   

PREV
15
జాన్వీ కపూర్ షాక్ అయ్యేలా.. జూనియర్ ఎన్టీఆర్ విందు.  ఏం చేశారో తెలుసా..?

చివరిదశ షూటింగ్ కు వచ్చింది దేవర సినిమా. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా.. కొరటాల శివ  డైరెక్ట్ చేస్తున్నఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఊరిస్తూ.. ఉన్నారు మూవీ మేకర్స్. సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి పలు విషయాలు  వైరల్ అవుతూనే ఉన్నాయి. 

25

ఈ సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వారికోసం అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమాకు సబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.  జాన్వీకపూర్  ఈసినిమాకు సబంధించి తన ఇనస్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.  తనకు దేవర షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ.. తెలిపింది. అంతే కాదు ఈ షూటింగులో తాను ఏం ఏం తింటుందో కూడా పిక్ ఒకటి పోస్టు చేసింది. ఈపోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

35

ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కు భారీ సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలు షూటింగ్ లలో భోజనం అంటే ప్రభాస్ మాత్రమే గుర్తుకు వస్తాడు. ఆయన షూటింగ్ లో అందరికి తన ఇంటినుంచే భోజనం తీసుకురప్పించడం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నట్టున్నాడు. దేవర షూటింగులో జాన్వీకపూర్‌కు ఎన్టీఆర్ అదిరిపోయే ఆతిథ్యం అందిస్తున్నాడట. 
 

45

తారక్  అరేంజ్ చేస్తున్న ఫుడ్ చూసి.. టేస్ట్ చేసి జాన్వీ కపూర్.. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యిందట. అంతే కాదు అందరికి.. సౌత్ ఇండియన్ పుడ్ గురించి.. ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ లో చెప్పుకుంటుందట కూడా.  ఎన్టీఆర్ అలాంటి  ఫుడ్ అరేంజ్ చేస్తున్నాడు మరి. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో దేవర షూటింగ్ అంటే తనకు ఇందుకే ఇష్టమని చెబుతూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పిక్ పోస్ట్ చేసింది.

55

ఈ ఫుడ్స్‌లో దమ్ బిర్యానీతో పాటు… మటన్ కర్రీ, రాగి సంగటి, చికెన్, పప్పు, కీమా, ఎగ్ కర్రీతో పాటు బెండకాయ కూర, పెరుగు ఇలా రకరకాల నోరూరించే ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తుండగా.. అవి చూసిన ఆడియన్స్ కూడా నోరు ఊరుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఏమనుకుంటున్నారు.. అది మా తారక్ అన్న అంటూ తెగ పొగిడేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories