Bigg Boss Telugu 8: హౌస్లోకి మరో శివాజీ, ఈసారి ఆ సర్ప్రైజింగ్ ఎంట్రీ ఎవరు? అందరి ఎదురు చూపు దాని కోసమే!

Published : Aug 01, 2024, 05:01 PM IST

బిగ్ బాస్ సీజన్ 7కి శివాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈసారి అలాంటి సర్ప్రైజింగ్ ఎంట్రీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.   

PREV
15
Bigg Boss Telugu 8: హౌస్లోకి మరో శివాజీ, ఈసారి ఆ సర్ప్రైజింగ్ ఎంట్రీ ఎవరు? అందరి ఎదురు చూపు దాని కోసమే!
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. షో భారీ టీఆర్పీ రాబట్టింది. గత సీజన్ లో అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఒక సామాన్యుడు టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. కాగా శివాజీ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 

25
Bigg Boss Telugu 7

ఇంకా రెండు మూడు వారాల్లో షో అనగా నటుడు శివాజీ పేరు తెరపైకి వచ్చింది. పొలిటికల్ కామెంట్స్ తో కాంట్రవర్సియల్ హీరోగా శివాజీ ఇమేజ్ మారింది. ఇక టైటిల్ విన్నర్ శివాజీ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. మైండ్ గేమ్ ఆడుతూ శివాజీ టైటిల్ ఫేవరేట్ అయ్యాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ కి అతడు గైడ్ గా వ్యవహరించాడు. అతడిని ప్రోత్సహించాడు. పల్లవి ప్రశాంత్ విజేత కావడంలో శివాజీ పాత్ర చాలా ఉంది. 

 

35
Bigg Boss Telugu 7

చివరి వారాల్లో పల్లవి ప్రశాంత్ బాగా పుంజుకున్నాడు. అదే సమయంలో శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అమర్ దీప్ కెప్టెన్ కాకుండా అడ్డుకోవడం, శోభా శెట్టి మీద చేసి హేట్ కామెంట్స్ అతని ఇమేజ్ ని దెబ్బ తీశాయి. శివాజీ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

45

సీజన్ 8లో ఆయన బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే శివాజీ తరహాలో ఒక సెన్సేషనల్ స్టార్ ని లేటెస్ట్ సీజన్ లో కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అనుభవంతో కూడిన ఆట ఆడే ఓ సీనియర్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సీజన్ లో 7 కంటెస్టెంట్ శివాజీ మాదిరి షోకు ప్లస్ అయ్యే సెలెబ్ కావాలట. 

 

55
Bigg boss telugu 8

కాగా ఒకప్పటి హీరోలు వినోద్ కుమార్, అబ్బాస్, రోహిత్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. ఈ ముగ్గురు కాకుంటే శివాజీ వలె చివర్లో ఒక కాంట్రవర్సియల్ పర్సనాలిటీని బరిలో దింపవచ్చుడు. ఏదీ ఏమైనా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది లాంచింగ్ ఎపిసోడ్ వరకు తెలియదు. అయితే ప్రచారమైన పేర్లలో చాలా వరకు ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories