ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా ఒకరికి మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్ద హీరోలను చిన్న స్టార్ హీరోలు అన్నా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. అలాంటి అనుబంధమే ఉంది ఎన్టీఆర్.. మహేష్ బాబు మధ్య.
వీరిద్దరు ఒకరికి మరోకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటుంటారు. మహేష్ బాబు పెద్దగా పార్టీలకు రారు కాని హీరోలతో కమ్యునికేషన్ మాత్రం మిస్ అవ్వరు.
సెలబ్రిటీ షోస్ ఏమున్నా.. పిలవగానే వెళ్తుంటారు మహేష్ బాబు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మర్యాధగా మాట్లాడుకుంటుంటారు. అలానే ఎన్టీఆర్ పిలవగానే ఓ షోకి వెళ్ళాడు మహేష్.
అంతే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జన్ ను బావా అంటూ రామ్ చరణ్ ను బ్రదర్ అంటూ.. చాలా క్లోజ్ గా పిలుస్తుంటాడు. మహేష్ బాబు అన్నా అని సంబోధిస్తుంటాడు తారక్. ఈక్రమంలోనే వీరిద్దరు ఓ ప్రోగ్రామ్ లో కలుసుకున్నారు.