మరోసారి వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వాచ్. కాస్ట్ తెలిస్తే కళ్లుతిరగడం ఖాయం..

First Published | Oct 12, 2023, 4:24 PM IST

మరోసారి తాను పెట్టుకున్న వాచ్ తో వార్తల్లో నిలిచారు టాలీవుడ్  యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే రెండు సార్లు కాస్ట్లీ వాచ్ లతో కనిపించిన తారక్.. మరోసారి తన స్పెషల్ వాచ్ తో వైరల్ న్యస్ అవుతున్నారు. ఇంతకీ ఈ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా...? 
 

సినిమా సెలబ్రిటీలు కాస్త డిఫరెంట్ గా... ఇంకాస్త కాస్ట్లీగా ఏ వస్తువు వాడినా.. దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రస్తుతం ఫ్యాన్స్ కు అలవాటుగా మారింది. తమ అభిమాన హీరో.. అంత గొప్ప బ్రాండ్ వాడతాడని.. అంత కాస్ట్లీ ఐటమ్స్ ధరిస్తాడని చెప్పుకోవడానికి ఫ్యాన్స్.. హీరోల వస్తువుల మీద కన్నేసి ఉంచుతారు. ఇప్పటికే మన టాలీవుడ్ స్టార్ హీరోలు వాడుతున్న చాలా కాస్ట్లీ వస్తువులు హైలెట్ అవుతూ వచ్చాయి. అందులో ఎక్కువగా ఎన్టీఆర్ వాచ్ లు, బట్టలు, కార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి.  

ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో  భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీ ద్వారా బాలీవుడ్ తార జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఆర్ఆర్ఆర్ గ్లోబల్ ఇమేజ్ తరువాత  తారక్ రేటు పెంచేశాడట...  ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడని టాక్. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. కాస్ట్లీ ఐటమ్స్ తో కనిపిస్తూ.. తారక్ ఎప్పటికప్పుడు వైరల్ న్యూస్ అవుతూనే ఉన్నారు. 


ఎన్టీఆర్ కు కార్లంటే అమితమైన ప్రేమ. అలాగే ఖరీదైన లగ్జరీ వాచ్ కలెక్షన్ కూడా అతని దగ్గర ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కాస్ట్లీ ఐటమ్స్ తో ట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. గతంలో అనేకసార్లు తారక్ ధరించిన వాచ్ గురించి అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ఇంతకీ ఆ వాచ్ స్పెషల్ ఏంటి..? కాస్ట్ ఎంత..? 

గతంలో అనేకసార్లు తారక్ ధరించిన వాచ్ గురించి అనేక వార్తలు వినిపించాయి. ప్రస్తుతం లేటేస్ట్ న్యూ వాచ్ పీస్ ధర సోషల్ మీడియాలో వైరలవుతుంది.MAD సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో సంగీత్ శోభన్.. తారక్ ను కలిశారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో తారక్ ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. 

ఆ వాచ్ స్విస్ లగ్జరీ బ్రాండ్ MB&F కు చెందినది. ఈ గడియారం అత్యద్భుతమైన ధర ట్యాగ్, దృష్టిని ఆకర్షించడం, ఆకర్షణీయంగా ఉండటం వల్ల స్పాట్‌లైట్‌గా ఉంది. ఈ MB&F టైమ్‌పీస్ ధర 1.66 కోట్లు అని తెలుస్తోంది.

ట్రిపుల్ ఆర్ సినిమాతో  ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు తారక్. అంతే కాదు.. ఆస్కార్ వేదిక దగ్గర అందరు ఎక్కువగా డిస్కర్షన్ చేసిన సెలబ్రిటీగా ఆశ్చర్యపరిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్. 

Latest Videos

click me!