ఇన్నాళ్లు టైమ్ సరిగాలేదని, ప్రతి బియ్యం గింజపైనా మన పేరు రాసి ఉన్నట్టే.. నటీనటులకూ నటించే ప్రతి పాత్రపైనా వారి పేరు రాసి ఉంటుందని అభిప్రాయపడింది. ప్రతి ఒక్క యాక్టర్ కు మంచి టైమ్ వస్తుందని, తనకిప్పుడు ఆ రోజులు వచ్చాయని పేర్కొంది. మంచి పాత్రల్లో నటిస్తుండటం తనను సంతోషపెడుతోందని చెప్పింది.