టాలీవుడ్ ఒకప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు బోలెడన్ని వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు అనేక చిత్రాల్లో కలసి నటించారు. కానీ క్రమంగా టాలీవుడ్ లో మల్టి స్టారర్ చిత్రాలు తగ్గుతూ వచ్చాయి. దర్శకధీరుడు రాజమౌళి రాంచరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కించిన తర్వాత మరోసారి మల్టీస్టారర్ చిత్రాల గురించి చర్చ మొదలైంది.