జూనియర్ ఎన్టీఆర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? తారక్ ఎన్ని భాషలు మాట్లాడుతారంటే?

Published : May 20, 2025, 04:48 PM IST

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR Jr) ఈ మధ్యే తన 42వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీప్రియులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, ఆయన జీవితంలోని కొంతమందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15

జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక్. అయితే ఆతరువాత ఆయన తాత నందమూరి తారక రామారావు పేరును పెట్టుకుని జూనియర్ అని తగిలించుకున్నారు. ఆయన పేరు తన తాతగారు, ప్రముఖ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరునే కొనసాగిస్తూ పెట్టారు. ఆయన చిన్నతనంలో బాలనటుడిగా సినిమాల్లో ప్రవేశించి 'జూనియర్ ఎన్టీఆర్' అనే పేరుతో పాపులర్ అయ్యారు.

25

తన తల్లి ప్రేరణతో స్కూల్ రోజుల్లోనే కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు ఎన్టీఆర్. అలా నేర్చుకోవడం ఆ తరువాత తన సినిమాల్లో డాన్సర్ గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రంలోని "నాటు నాటు" పాటలో ఆయన అద్భుతమైన డాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఆస్కార్ కూడా సాధించింది.

35

నటుడిగా మాత్రమే కాకుండా, జూనియర్ ఎన్టీఆర్ ఒక గాయకుడు కూడా. ఆయన తన గాత్రంతో "యమదొంగ" సినిమాలో ఒలమ్మీ తిక్కా రెగిందా అనే పాటతో మొదలుకొని "కంత్రి" సినిమాలో 123 నేనొక కంత్రి, "రభస"లో రాకసి రాకసి వంటి పాటలు పాడారు.

45

ఇక తెలుగు నటుడే కాని ఎన్టీఆర్ చాలా భాషలు మాట్లాడగలడు. ఆయనకు తెలుగు తో పాటు కన్నడ, హిందీ, తమిళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. RRR చిత్రంలో తన పాత్రకు సంబంధించిన సంభాషణలను హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా తానే డబ్ చేశారు.

ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం గల కుటుంబానికి చెందినవారు. ఆయన తాతగారు ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాగా, ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ సినీ నటుడిగా, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. నందమూరి కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా, రాజకీయంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

55

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ద్వారా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరి అంతర్జాతీయ గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపారు. ఆయన కెరీర్‌లో ఇవన్నీ ఒక ప్రత్యేకతను సూచిస్తున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత దేవర సినిమాతో దుమ్మురేపిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో పాన్ఇండియా సినిమా హడావిడిలో ఉన్నాడు. త్వరలో ఆయన నటించిన వార్ 2 కూడా రిలీజ్ కాబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories