`బిగ్‌ బాస్‌ తెలుగు 5` విన్నర్‌ సినిమాల్లేక ఏం చేస్తున్నాడో తెలుసా? వ్యాపారం అదిరిపోయింది

Published : May 20, 2025, 04:42 PM IST

`బిగ్‌ బాస్‌ తెలుగు 5` విన్నర్‌ వీజే సన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సినిమాల్లేక వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 

PREV
16
సన్నీ లైఫ్‌ని మార్చేసిన `బిగ్‌ బాస్‌ తెలుగు 5`

`బిగ్‌ బాస్‌ తెలుగు 5` విన్నర్‌గా నిలిచాడు వీజే సన్నీ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఒకటి అర ఆఫర్లతో కెరీర్‌ లాక్కొచ్చాడు. ఈక్రమంలో బిగ్‌ బాస్‌ ఆఫర్‌ ఆయన జీవితాన్నే మార్చేసింది. అంతకుముందు ఇండస్ట్రీలో కొంత మందికే పరిచయం సన్నీ. కానీ ఈ షో తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ని ఏర్పాటు చేసుకున్నాడు.

26
బిగ్‌ బాస్‌ షోలో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా సన్నీ

వీజే సన్నీ `బిగ్‌ బాస్‌ తెలుగు` ఐదో సీజన్‌లో అందరిలానే చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభంలో కాస్త హడావుడి చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గాంభీర్యంగా వ్యవహరించి, అందరిని డామినేట్‌ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాత కామెడీ అయిపోయాడు, ఆయన చేసే పనులు కామెడీగా మారాయి. దీంతో మంచి ఎంటర్‌టైనర్‌గా మారిపోయాడు సన్నీ.

36
అందరికి షాకిస్తూ బిగ్‌ బాస్‌ తెలుగు 5 విన్నర్‌గా వీజే సన్నీ

కానీ ప్రారంభంలో అందరు కంటెస్టెంట్లలో ఒకరిగానే ఉన్నాడు, కానీ షణ్ముఖ్‌ జస్వంత్‌తో, సిరి హన్మంత్‌తో ఎప్పుడైతే గొడవలు ప్రారంభమయ్యాయో ఇక రెచ్చిపోయాడు. అవే సన్నీని స్ట్రాంగ్‌గా మార్చాయి. విన్నర్‌గా మార్చేశాయి. 

ఎవరూ ఊహించని విధంగా బిగ్‌ బాస్‌ తెలుగు 5 విన్నర్‌గా నిలిచాడు సన్నీ. అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతోఆయనకు వచ్చిన క్రేజ్‌ మామూలు కాదు. దీంతో సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

46
వీజే సన్నీ హీరోగా చేసిన సినిమాలు డిజప్పాయింట్‌

బిగ్‌ బాస్‌ షో తర్వాత `అన్‌ స్టాపబుల్‌`, `సౌండ్‌ పార్టీ` చిత్రాల్లో హీరోగా నటించాడు. అంతకు ముందే బిగ్‌ బాస్‌ లోకి వెళ్లక ముందే `సకలగుణాభి రామ` చిత్రంలో నటించాడు. అది ఆయన షో నుంచి బయటకు వచ్చాక విడుదలైంది.

 కానీ ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన `అన్‌ స్టాపబుల్‌` నిరాశ పరిచింది. ఆ తర్వాత చేసిన `సౌండ పార్టీ` సైతం డిజప్పాయింట్‌ చేసింది.

56
సినిమా ఆఫర్ల కోసం స్ట్రగుల్‌ అవుతున్న సన్నీ

అంతే ఎంత క్రేజ్‌ వచ్చిందో, అంతే వేగంగా పోయింది. సినిమాలు ఆడకపోవడంతో సన్నీకి మళ్లీ స్ట్రగుల్‌ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత `ఏటీఎం` అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఇది మంచి ఆదరణ పొందింది. కానీ ఆఫర్లని తీసుకురాలేకపోయింది. 

ఆ తర్వాత హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు సన్నీ. ఒక మల్టీస్టారర్‌ స్టోరీ కూడా రెడీ చేసుకున్నారు. కానీ మరో హీరో దొరక్క వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ మూవీ పడితే కెరీర్‌ మారిపోతుందని భావిస్తున్నాడు, కానీ అది ఎప్పటికీ వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

66
వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన వీజే సన్నీ

ఇక ఇప్పుడు వీజే సన్న చేతిలో సినిమాల్లేవు. వెబ్‌ సిరీస్‌లు కూడా లేనట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన లైఫ్‌ ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో విదేశీ ట్రిప్‌ ఫోటోలు పంచుకుంటూ అలరిస్తున్నారు. తాను ఎలాంటి లైఫ్‌ని అనుభవిస్తున్నాడో తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు.

 అయితే ఇటీవల సన్నీవ్యాపారంలోకి అడుగుపెట్టాడు. క్రిష్ణానగర్‌లో టిఫిన్‌ సెంటర్ స్టార్ట్ చేశాడు. సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్ అన్నీ లభించేలా `అమృతం అడ్డా` పేరుతో హోటల్‌ని స్టార్ట్ చేశాడు. దీనికితోడు షాపింగ్‌ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ రాణిస్తున్నారు సన్నీ. అయినా సినిమా ప్రయత్నాలు వదలడం లేదు. మరి ఆయనకు ఎప్పుడు బ్రేక్‌ వస్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories