తమిళ బ్లాక్‌ బస్టర్‌ మూవీని మెచ్చుకున్న రాజమౌళి, హార్ట్ టచ్చింగ్‌గా ఉందంటూ పోస్ట్

Published : May 20, 2025, 02:44 PM ISTUpdated : May 20, 2025, 04:10 PM IST

కోలీవుడ్‌ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ` తక్కువ బడ్జెట్‌ లో తెరకెక్కి పెద్ద విజయం సాధించింది. కాసుల వర్షం కురిపిస్తుంది.  ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు. 

PREV
14
భారీ వసూళ్ల దిశగా `టూరిస్ట్ ఫ్యామిలీ`

అబిషన్ జీవింద్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జైషంకర్, కమలేష్, ఎం.ఎస్.భాస్కర్, యోగిబాబు, రమేష్ తిలక్ వంటి తారాగణం నటించిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 12 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, 20 రోజులు దాటినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.

24
`టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ

శ్రీలంక నుంచి తమిళనాడుకు శరణార్థిగా వచ్చిన ఓ కుటుంబం చెన్నైలో అక్రమంగా స్థిరపడుతుంది. దాని వల్ల వచ్చే సమస్యలను, ఆ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ లో హాస్యభరితంగా చూపించారు. హృద్యంగా, ఫన్నీగా ఉండటంతో సోషల్ మీడియా, థియేటర్లలో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చాలామంది కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఆనందిస్తున్నారు. రజనీకాంత్, ధనుష్, శివకార్తికేయన్, అనిరుధ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

34
రాజమౌళి ప్రశంసలు

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘టూరిస్ట్ ఫ్యామిలీ` సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “టూరిస్ట్ ఫ్యామిలీ’ అనే అద్భుతమైన సినిమా చూశాను. ఈ సినిమా హృదయాన్ని తాకుతుంది. హృద్యంగా, నవ్వులు పూయిస్తుంది. అబిషన్ జీవింద్ అద్భుతమైన రచన, దర్శకత్వం సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా చూసేలా చేసింది. ఇటీవలి కాలంలో చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఇదొకటి. తప్పక చూడాల్సిన సినిమా” అని రాసుకొచ్చారు.

44
దర్శకుడు అబిషన్ ఆనందం

రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శకుడు అబిషన్ జీవంద్, “ఇంకా నమ్మలేకపోతున్నాను, ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో పెద్ద పెద్ద స్టార్స్ ని నా కళ్ళారా చూశాను. ఆ ఘన ప్రపంచాలను సృష్టించిన వ్యక్తి ఒకరోజు నా పేరు చెబుతారని నేను ఊహించలేదు. ఈ చిన్న పిల్లాడి కలని జీవితం కంటే గొప్పగా మార్చేశారు” అని పోస్ట్ చేశారు. ఇదిప్పుడు వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories