
దర్శకుడు బుచ్చిబాబు.. `పెద్ది` సినిమాతో నేషనల్ వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. `పెద్ది` సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిదని చెప్పొచ్చు. రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, జాన్ విజయన్ వంటి వారు నటించారు. ఈ గురువారం ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. దీనికి మిక్స్ డ్ టాక్ వచ్చిన తొలి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఈ వీకెండ్ వరకు మంచి వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది.
బుచ్చిబాబుకి `పెద్ది` రెండో చిత్రం. మొదట ఆయన `ఉప్పెన` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇది అటు వైష్ణవ్ తేజ్‌కి, ఇటు కృతి శెట్టికి మొదటి సినిమా కావడం విశేషం. ఒక్క మూవీతో వీరిద్దరు స్టార్స్ అయిపోయారు. ఈ సినిమా బుచ్చిబాబుకి కూడా ఫస్ట్ మూవీనే. దీంతో ఆయన కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడని చెప్పొచ్చు.
ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. కథ కూడా నెరేట్ చేశారు. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో ఏమో ఆ మూవీ తారక్ చేయలేదు. కథ పరంగా వచ్చిన డిఫరెంట్స్ కారణంగా ఎన్టీఆర్ చేయలేకపోయారని అన్నారు. మరోవైపు డేట్స్ ఇష్యూ కారణంగా చేయలేదనే కామెంట్ కూడా వచ్చింది. దీంతో ఆ తర్వాత రామ్ చరణ్‌కి బుచ్చిబాబు కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. ఈ గురువారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఎన్టీఆర్‌కి చెప్పింది `పెద్ది` కథ కాదని బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి బుచ్చిబాబు కథ చెప్పడం ఇప్పుడు కాదు, ఆయన దర్శకుడు కాకముందే ఓ కథ చెప్పాడట. ఎన్టీఆర్.. సుకుమార్ దర్శకత్వంలో `నాన్నకు ప్రేమతో` చిత్రాన్ని చేశాడు. ఆ సమయంలో సుకుమార్ వద్ద బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో బుచ్చిబాబు వీలు చూసుకొని ఓ కథని నెరేట్ చేశాడు. ఆ టైమ్‌లో కథ విన్న ఎన్టీఆర్.. ఈ కథ ఎవరి వద్దో దొబ్బేశావ్ కదా అన్నాడట. అయితే అది సరదాగా అన్న మాట అని వెల్లడించారు బుచ్చిబాబు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో ఉంటే తాను అసిస్టెంట్, ఆయన స్టార్ హీరో అనే తేడా ఉండదు, ఆ లైన్స్ ని చెరిపేస్తారని వెల్లడించారు.
ఒక కొత్త హీరోకి అనుకుంటున్నానని చెప్పి, లండన్‌లో `నాన్నకి ప్రేమతో` మూవీ షూటింగ్ టైమ్‌లో తారక్‌కి కథ చెప్పాడట బుచ్చిబాబు. అంతా విని, నిజం చెప్పు ఈ కథ ఎవరి వద్దనో దొబ్బేశావ్ కదా అన్నాడట. దెబ్బకి మతిపోయిందట బుచ్చిబాబుకి. అది తనకు పెద్ద కాంప్లిమెంట్ అని వెల్లడించారు. ఎందుకంటే కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మాటలు బాగున్నాయని అని చెప్పడం కంటే దొబ్బేశావ్ అని చెబితే అదొక గొప్ప కాంప్లిమెంట్ అని, అది గొప్ప కథ అవుతుందని, ఎన్టీఆర్ ఆ మాట చెప్పినప్పుడు తనకు ఆ విషయం అర్థమయ్యిందని వెల్లడించారు బుచ్చిబాబు. తాజాగా ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.