ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే.. జూ.ఎన్టీఆర్ మరీ మొండోడులా ఉన్నాడే

First Published Apr 6, 2024, 7:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఏపీలో ఎలెక్షన్ టైం కాబట్టి గత ఎన్నికలకి సంబంధించిన కొన్ని విషయాలపై సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. 

అందులో ఒకటి 2009లో ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ కోసం చేసిన ప్రచారం ఒక సంచలనం అనే చెప్పాలి. అయితే ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తారక్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆందోళనకరంగా ఏమి జరగకపోవడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. బలమైన గాయాలు అయినప్పటికీ తారక్ కోలుకుని తిరిగి అదే ఎనేర్జితో వచ్చారు. 

ఆ యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచన సరళి మారిందట. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయట పెట్టాడు. మంచు లక్ష్మి యాంకర్ గా చేసిన ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన మాటలు వింటే ఇంత మొండోడు ఏంటి అని అనిపించకమానదు. 

ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నీ మైండ్ లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి అని మంచు లక్ష్మి ప్రశ్నించింది. మనం బతికినన్ని రోజులు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలి. చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి. నాకు జరిగిన యాక్సిడెంట్ లో చనిపోతానని నేను అనుకోలేదు. నాలో ఏదో తెలియని బలమైన కాన్ఫిడెన్స్ ఉండింది. 

ఇంత త్వరగా చనిపోను అనే నమ్మకం కావచ్చు.. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది కదా అనే నమ్మకం కావచ్చు.. ఏదో ఒక నమ్మకం వల్ల బతికాను. మరీ వరస్ట్ గా కాకుండా 6 నెలల్లో కోలుకున్నాను. ఆ యాక్సిడెంట్ తర్వాత నా ఆలోచనలో మాత్రం మార్పు వచ్చింది. నేను చూడాల్సింది చాలా ఉంది.. సాధించాల్సింది చాలా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీలైనంత త్వరగా చేయాల్సినవి చేయాలి.

ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. తారక్ చావు గురించి ఇలా కామెంట్స్ చేస్తుంటే మరీ మొండోడు లా ఉన్నాడే అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.  ఇక తారక్ రాజకీయాల్లోకి రావడం గురించి కూడా ఆ ఇంటర్వ్యూలోనే స్పందించారు. 

ఒక టిడిపి కార్యకర్తగా.. మా తాత పెట్టిన పార్టీ కాబట్టి బాధ్యతతో ప్రచారం చేశా. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఊహించుకుంటూ నేను బతకను. ఎవరైనా అభిమానులు కొన్ని మాటలు, కేకలు వింటుంటే వాళ్ళకి గూస్ బంప్స్ రావడానికి అవి బావుంటాయి. కానీ నేను ఈ క్షణం ఏం చేయాలి అనే దానిగురించే ఆలోచిస్తాను అని తారక్ ఆ సమయంలో చెప్పాడు. 

click me!