ఈ జనరేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్, మహేష్, బన్నీ వీళ్ళెవరూ కాదు

First Published | Dec 25, 2024, 7:46 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత 1000 కోట్లు సాధించే సత్తా ఈ చిత్రానికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వందల కోట్ల బడ్జెట్ లో మైండ్ బ్లోయింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత 1000 కోట్లు సాధించే సత్తా ఈ చిత్రానికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వందల కోట్ల బడ్జెట్ లో మైండ్ బ్లోయింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. అదే విధంగా ప్రశాంత్ నీల్ తో కూడా ఒక చిత్రం చేయాల్సి ఉంది. 

ఈ జనరేషన్ లో అద్భుతంగా నటించే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ వాయిస్ కి, డైలాగ్ డెలివరీకి అభిమానులు ఉన్నారు. ఓ ఈవెంట్ లో రానా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఒక ఊహించని ప్రశ్నతో రానా మెలిక పెట్టాడు. ఈ జనరేషన్ లో నీకు నాచే నటుడు ఎవరు అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొదట ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డారు. 


ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంది అని తారక్ తెలిపాడు. మన జనరేషన్ లో మహేష్ బాబు హ్యాండ్సమ్ హీరో. ఆ విధంగా ఒక్కొక్క హీరోలో ఒక్కో ఫీచర్ ఉందని ఎన్టీఆర్ తెలిపాడు. బాహుబలి తర్వాత నీ వాయిస్ కి కూడా నేను అభిమానిని అయ్యాను అని ఎన్టీఆర్.. రానాని ప్రశంసించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తన మనసులో మాట బయటపెట్టారు. 

ఈ జనరేషన్ లో నాకు నాని నటన అంటే చాలా ఇష్టం అని ఎన్టీఆర్ తెలిపారు. నానికి తన భార్య లక్ష్మీ ప్రణతి కూడా అభిమాని అని మరో ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. నాని పిల్ల జమిందార్ చిత్రాన్ని ఆమె కొన్ని వందల సార్లు చూశారట. 

జనతా గ్యారేజ్ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఐఫా అవార్డు అందుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 ఐఫా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ నిలిచారు. జనతా గ్యారేజ్ చిత్రంతో పాటు ధృవ, సరైనోడు, పెళ్లి చూపులు చిత్రాలు నామినేషన్స్ లో నిలిచాయి. 

Latest Videos

click me!