ఎన్టీఆర్ ‘దేవర’ ఓపినింగ్స్ : తెలుగు అదుర్స్,మిగతా భాషల పరిస్దితి ఏమిటి?

First Published Sep 27, 2024, 3:49 PM IST

భారీ ఎక్సపెక్టేషన్స్  సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. 


ఎన్టీఆర్‌-కొరటాల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’తర్వాత  వీరిద్దరూ కలిసి చేసిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘దేవర’ (Devara Movie). ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ (NTR) సోలో హీరోగా చేస్తుండటం, జాన్వీ (Janhvi Kapoor) ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అందుకు తగినట్లుగానే ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయి.  తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘దేవర’(Devara) గురించి, ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం మాట్లాడుతున్నారు. మరి మిగతా భాషల్లో ఎలా ఉంది
 


భారీ అంచనాల నడుమ విడుదల అయిన  ఈ సినిమా రిలీజ్ కు ముందే అనేక రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్ను బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమా ఇదే.

 ఈ సినిమా అదనపు షోలు, టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అందుకు తగినట్లుగానే ఎర్లీ షో స్ నుంచే కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఓపినింగ్స్ భీబత్సం.  అయితే అదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్దాయిలో ఓపినింగ్స్ రాబట్టలేకపోయిందని వార్తలు వస్తన్నాయి. 
 

Latest Videos



 ఎన్నో ఎక్సపెక్టేషన్స్  సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేసారు మేకర్స్.అందుకు తగ్గట్టుగానే మేకర్స్ భారీ ప్రమోషన్స్ ని దేశ వ్యాప్తంగా చేసారు.

తెలుగు రెండు రాష్ట్రాల్లో ఊహకు అందని విధంగా 100 కోట్లు దాకా ఓపినింగ్స్ రావబడుతోందని అంచనా. నిన్నటి అడ్వాన్స్ బుక్కింగ్స్ 75 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యాయి. అయితే దేవర మిగతా భాషల్లో ఫెరఫార్మెన్స్ స్లోగా కనపడుతోంది.  మొదటి రోజు ఆక్యుపెన్సీలు సైతం డల్ గా ఉన్నాయి.   ఈ క్రమంలో నార్త్ లో దేవర ఎలాంటి పెర్ఫామెన్స్ ని చేస్తోంది అనేది కూడా ఆసక్తిగా మారింది.


వాస్తవానికి  ఈ సినిమాకు బాలీవుడ్‌ నుంచి అద్భుతమైన సపోర్ట్ లభించింది. బాలీవుడ్‌ మేజర్‌ ప్లేయర్స్ ఈ చిత్రంతో చేతులు కలిపారు. ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్స్ కలిసి ఈ సినిమాను ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. దేవర నార్త్ థియేట్రికల్‌ రైట్స్ ని కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ సొంతం చేసుకున్నారు.

అత్యంత భారీ మొత్తం చెల్లించి ఈ మాగ్నమ్‌ ఆపస్‌ని దక్కించుకున్నారు వారిద్దరూ.  ఎన్టీఆర్‌కి ఉత్తరాదిన ఉన్న స్టార్‌డమ్‌కి, కరణ్‌ జోహార్‌, అనిల్‌ తండానీ పేర్లు యాడ్‌ కావడంతో వేరే లెవల్‌ బజ్‌ క్రియేటైంది. మరి అందుకు తగ్గ కలెక్షన్స్ వస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. 


రిలీజ్ కు ముందు విడుదలైన ట్రైలర్ ఎన్టీఆర్‌ రోల్‌ మీద భీభత్సమైన ఇంట్రస్ట్  క్రియేట్‌ చేసింది. ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రకాష్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, నరేన్‌ కీలక పాత్రల్లో నటించారు.  దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్,  యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె. ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందించారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేసారు. ఆర్‌. రత్నవేల్‌ తన కెమెరా పనితనంతో మిరాకిల్స్ సృష్టించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా సాబు సిరిల్‌ వ్యవహరించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే డే 1 కి సెన్సేషనల్ బుకింగ్స్ దేవర కి నమోదు అవుతున్నాయి. ఇలా లేటెస్ట్ ట్రెండ్ ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో 10 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. దీనితో టోటల్ రిపోర్టింగ్ గ్రాస్ గా అయితే దేవర నైజాం మార్కెట్ లో భారీ నంబర్స్ ని సెట్ చెయ్యడం ఖాయం అంటున్నారు. 

click me!