ఫ్లాప్ దర్శకుడివి, నీతో ఎన్టీఆర్ సినిమా చేయడు.. ముఖం మీదే చెప్పిన నిర్మాత, ఏం జరిగిందంటే

First Published | Sep 27, 2024, 3:13 PM IST

ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు అనే టాక్ ఉంది. కొరటాల శివకి కూడా దేవరకి ముందు ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర హంగామాతో నిండిపోయింది. దేవర చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ విశేషాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు అనే టాక్ ఉంది. 

కొరటాల శివకి కూడా దేవరకి ముందు ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. గతంలో డైరెక్టర్ బాబీతో ఎన్టీఆర్ జై లవకుశ అనే చిత్రం రూపొందించారు. ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ చిత్రానికి ముందు డైరెక్టర్ బాబీకి ఆసక్తికర సంఘటన ఎదురైందట. 


జై లవకుశ మూవీకి ముందు డైరెక్టర్ బాబీ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ మూవీలో డైరెక్టర్ బాబీ ప్రమేయం తక్కువ. ఆ చిత్రానికి కథ అందించింది పవన్ కళ్యాణ్. కాబట్టి బాబీ తప్పు ఏమి లేదు. కానీ సినిమా ఫ్లాప్ కాబట్టి ఆ ఎఫెక్ట్ బాబీపై కూడా పడింది. 

సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబీ ఎన్టీఆర్ కోసం జై లవకుశ కథ రాసుకున్నారు. కథ ఎన్టీఆర్ కి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఇద్దరు నిర్మాతలు బాబీని చులకనగా మాట్లాడారట. నువ్వు ఫ్లాప్ డైరెక్టర్ వి.. నీతో తారక్ ఎందుకు సినిమా చేస్తాడు.. చేయడు లే అని నిరాశపరిచారట. 

కానీ బాబీ మాత్రం తన ప్రయత్నం మానుకోలేదు. ఎలాగోలా ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పాడు. ఎన్టీఆర్ కథ బావుందని చెప్పారు కానీ సినిమా చేస్తానని కానీ, తర్వాత చూద్దాం అని కానీ ఏమీ మాట్లాడలేదట. కొన్ని రోజులకి ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి బాబీకి కాల్ వచ్చింది. ఎన్టీఆర్ కి మీరు చెప్పిన కథ నచ్చింది.. మనం సినిమా చేస్తున్నాము అని చెప్పారట. ఆ విధంగా జై లవకుశ చిత్రం తెరకెక్కించి బాబీ మంచి విజయం అందుకున్నారు. 

Latest Videos

click me!