హీరోయిన్స్ నందు సాయి పల్లవి(Sai Pallavi) వేరయా... ఆమె ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. నిజంగా సాయి పల్లవి ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి. ఆమె ఆలోచనలు, పద్ధతులు, ఆచరణలు ఎప్పుడో సావిత్రి కాలాన్ని తలపిస్తాయి. హీరోయిన్ గా పరిశ్రమలో ఉండాలంటే తమ ఇష్టాలు, సిద్ధాంతాలు వదిలేయాలని, గుడ్డిగా దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలనే రూల్ ఆమె బ్రేక్ చేశారు.