రాజమౌళి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, పాత బైక్ లో తిరుగుతూ.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అన్నారో తెలుసా

Published : Nov 06, 2025, 08:13 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రాన్ని రాజమౌళి ఎలా పూర్తి చేశారో తారక్ వివరించారు. 

PREV
15
ఎన్టీఆర్ తో రాజమౌళి బాండింగ్ 

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమా శిఖరాగ్రాన ఉన్నారు. ఇండియన్ సినిమాలో ది బెస్ట్ డైరెక్టర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే రాజమౌళి సాధించిన ఈ ఘనత ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. ఎన్నో ఏళ్ళ కష్టం, దర్శకుడిగా ఎదగడం కోసం అనుభవించిన స్ట్రగుల్స్ ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళికి ఎక్కువ అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. 

25
పాత యమహా బైక్ లో తిరుగుతూ.. 

రాజమౌళి దర్శకుడిగా పరిచయమైంది స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతోనే. ఆ మూవీ సమయంలో రాజమౌళి పడ్డ కష్టాన్ని కళ్లారా చూశానని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజమౌళి విమర్శించే అర్హత, కామెంట్స్ చేసే అర్హత ఎవరికీ లేదని తారక్ తెలిపాడు. స్టూడెంట్ నెంబర్ 1 టైంలో రాజమౌళికి పాత యమహా బైక్ ఉండేది. ఆ బైక్ లో రోజూ ఉదయాన్నే రాఘవేంద్ర రావు దగ్గరకి వెళ్లి సీన్ ఓకే చేయించుకుని, సెట్ కి వచ్చి షూట్ చేసేవారు. ఆ తర్వాత డబ్బింగ్, రీ రికార్డింగ్ ఇలా అన్ని పనులకు ఆ బైక్ లోనే తిరిగేవాడు. 

35
రాజమౌళిపై తీవ్ర ఒత్తిడి 

ఆ తర్వాత సింహాద్రి విషయంలో కూడా రాజమౌళి సుఖం లేదు. సింహాద్రి మూవీ ఇంకా రాజమౌళిపై ఒక కత్తి పెట్టినట్లు అయింది. ఎందుకంటే అంతకు ముందు ఆది సినిమాతో నాకు మంచి హిట్ వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత రాజమౌళి, నా కాంబోలో వస్తున్న మూవీ కావడంతో విపరీతంగా అంచనాలు పెరిగాయి. 

45
అన్నీ మౌనంగా భరిస్తూ.. 

 దీనికి తోడు సింహాద్రి నిర్మాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి రాజమౌళిపై ఉండేది. ఆ ఒత్తిడిని రాజమౌళి మౌనంగా భరిస్తూ సినిమా షూటింగ్ చేశారు. సక్సెస్ అయ్యారు అని ఎన్టీఆర్ తెలిపారు. ఇటీవల బాహుబలి రీ రిలీజ్ సమయంలో కూడా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి తీసుకునే ఒత్తిడి గురించి తెలిపారు.

55
మొన్నటి వరకు అప్పులు 

బాహుబలి 1 డెఫిసిట్ లో రిలీజ్ అయింది. నిర్మాతలు పైకి 20 కోట్ల లోటు అని చెబుతున్నారు కానీ వాస్తవానికి 40 కోట్లకి పైగానే డెఫిసిట్ ఉంది. ఆయా లోటు భర్తీ కావాలి అంటే సినిమా పెద్ద విజయం సాధించాలి. కానీ ఫస్ట్ డే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అందరం ఆందోళన చెందాం ? నిర్మాతలు రాజమౌళిని నమ్మి సినిమా చేశారు. ఆ లోటుని భర్తీ చేయడానికి నా దగ్గర ఆస్తులు కూడా లేవు అని జక్కన్న అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి గురించి నాకు తెలుసు.. మొన్నటి వరకు అప్పులు కడుతూనే ఉన్నారు అని తెలిపారు. కానీ బాహుబలి 1 రెండవరోజు నుంచి పికప్ అయింది. భారీ విజయం సాధించింది. 

Read more Photos on
click me!

Recommended Stories