జూ.ఎన్టీఆర్ అట్టర్ ఫ్లాప్ చిత్రానికి అక్కడ అంత క్రేజా.. ఇదెక్కడి మాస్ బాబోయ్, ఈ సంగతి తెలుసా..

First Published Mar 15, 2024, 1:19 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కి పాన్ ఇండియా క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. కొమరం భీం ఎమోషనల్ గా నటిస్తూనే యాక్షన్ తో విశ్వరూపం ప్రదర్శించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కి పాన్ ఇండియా క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. కొమరం భీం ఎమోషనల్ గా నటిస్తూనే యాక్షన్ తో విశ్వరూపం ప్రదర్శించారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. 

మరోవైపు ఎన్టీఆర్ డైరెక్ట్ గా బాలీవుడ్ లోకి వార్ 2 చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ తో కలసి తారక్ నటించబోతున్నారు. తారక్ తొలిసారి బాలీవుడ్ లోకి డెబ్యూ చేస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి ఉండడం సహజం. కానీ బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయి.. హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ క్రేజ్ ఎలా పనిచేస్తుంది లాంటి సందేహాలు ఉండొచ్చు. 

వీటన్నింటికి సమాధానం ఇస్తూ ఓ హిందీ డిస్ట్రిబ్యూటర్ జాతీయ మీడియాలో ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ చిత్రంలో నటించే నిర్ణయం అద్భుతం అని సదరు డిస్ట్రిబ్యూటర్ అన్నారు. నందమూరి ఫ్యామిలీ అంటే దేశం మొత్తం తెలుసు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి నటనతో, డ్యాన్స్ స్కిల్స్ తో ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు. 

హిందీలో కూడా ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా హిందీ చిత్రంలో నటిస్తుండడం ఆయన ఫ్యాన్ బేస్ పెరిగేలా చేస్తుంది. ఎన్టీఆర్ నటించిన చాలా చిత్రాలు హిందీలో డబ్ అయ్యాయి. తారక్ చేసే ఆవేశంతో కూడుకున్న పాత్రలు, డ్యాన్సులకు టెలివిజన్ లో అద్భుతమైన స్పందన వస్తూ ఉంటుంది. 

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది అందులో డౌట్ లేదు. కానీ అంతకంటే ముందే హిందీలో బుల్లితెరపై తారక్ డబ్బింగ్ చిత్రాలు రచ్చ రచ్చ చేశాయి. ముఖ్యంగా అశోక్ చిత్రం నార్త్ లో అద్భుతమైన రేటింగ్స్ తెచ్చిపెట్టింది. నార్త్ లో ప్రతి ఇంట్లో కుర్రాడిలా ఎన్టీఆర్ అశోక్ డబ్బింగ్ చిత్రంతో మారిపోయారు. 

అదే విధంగా ఊసరవెల్లి, బాద్షా, అల్లరి రాముడు, బృందావనం లాంటి చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అశోక్ చిత్రం తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ నార్త్ లో బుల్లితెరపై ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది అని సదరు డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. 

వార్ 2 చిత్రానికి ఎలాగు హృతిక్ రోషన్ క్రేజ్ ఉంది. ఇక దేవర చిత్రం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్ లాంటి ప్రాంతాల్లో 400 పైగా థియేటర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఆ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. మరి చూడాలి తారక్ పాన్ ఇండియా బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుస్తాడో. 

click me!