స్టార్ హీరో పుట్టుమచ్చ వల్ల నిజాలు బయటకి.. కోర్టు కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్, సింపతీ కోసం డ్రామా ?

Published : Mar 15, 2024, 11:43 AM IST

తమిళ అగ్ర హీరోల్లో ధనుష్ ఒకరు. ఆ మధ్యన ధనుష్.. ఐశ్వర్య రజనీకాంత్ నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ధనుష్ కి రజని అల్లుడనే ట్యాగ్ కూడా పోయింది. అయినప్పటికీ ధనుష్ కి తమిళనాట ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉంది.

PREV
17
స్టార్ హీరో పుట్టుమచ్చ వల్ల నిజాలు బయటకి.. కోర్టు కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్, సింపతీ కోసం డ్రామా ?
Actor Dhanush

తమిళ అగ్ర హీరోల్లో ధనుష్ ఒకరు. ఆ మధ్యన ధనుష్.. ఐశ్వర్య రజనీకాంత్ నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ధనుష్ కి రజని అల్లుడనే ట్యాగ్ కూడా పోయింది. అయినప్పటికీ ధనుష్ కి తమిళనాట ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉంది. పాన్ ఇండియా  స్థాయిలో కూడా ధనుష్ కి గుర్తింపు ఉంది. 

27
Dhanush

ధనుష్ నటించే చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. బక్క పలచని దేహంతో ధనుష్ చేసే విలక్షణ నటన అందరికి నచ్చే విధంగా ఉంటుంది. మూస యాక్షన్ చిత్రాలకు ధనుష్ వ్యతిరేకం.. ధనుష్ ఎలాంటి సినిమా చేసినా అందులో వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు. 

37
dhanush

ధనుష్ నటించిన అసురన్, కర్ణ లాంటి చిత్రాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదంతా పక్కనే పెడితే ధనుష్ ని ఒక కేసు ఏళ్ళ తరబడి వేధిస్తోంది. ధనుష్ తరపున న్యాయవాది కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. కొన్ని సార్లు ధనుష్ కూడా కోర్టుకి హాజరు కావాల్సి వచ్చింది. 

47
actor dhanush

అసలు ఇంతకీ ఏమైందంటే.. తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకి చెందిన కదిరేశన్ దంపతులు ధనుష్ తమ కొడుకు అంటూ కోర్టుకి ఎక్కారు. సినిమాల్లో నటించడానికి ధనుష్ 11 వ తరగతిలో ఇంటి నుంచి పారిపోయాడు అంటూ కదిరేశన్ దంపతులు కొన్ని ఆధారాలతో కోర్టుని ఆశ్రయించారు. తమ కొడుకుని తమకి అప్పగించాలని కోరారు. 

57

అంతా కాదు ధనుష్ తమ బాగోగుల కోసం నెలకి 60 వేలు డబ్బు పంపాలని కూడా కదిరేశన్ కోర్టుని కోరారు. దీనితో ధనుష్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబందించిన కొన్ని సర్టిఫికెట్స్ కూడా కోర్టుకి అందించారు. 2017లో కదిరేశన్ కోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. మేలూరు కోర్టు నుంచి ఈ కేసు మధురై కోర్టుకి బదిలీ అయింది. 

67

కదిరేశన్ దంపతులు మధురై కోర్టులో ధనుష్ కి సంబందించిన పుట్టు మచ్చల ఆధారాలు ఉన్న టీసీని అందించారు. ధనుష్ తరుపున న్యాయవాది అందించిన టీసీలో ఆ తరహా పుట్టు మచ్చలు లేవు. దీనితో న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనితో కోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ధనుష్ పుట్టు మచ్చలని పరిశీలించారు. కదిరేశన్ పేర్కొన్నట్లు ధనుష్ కి అలాంటి పుట్టుమచ్చలు లేవు అని తేలింది. 

77

దీనితో ధనుష్ కదిరేశన్ దంపతుల కొడుకు అని సరైన ఆధారాలు లేవు అని ప్రస్తావిస్తూ న్యాయమూర్తి కేసుని కొట్టివేశారు. దీనితో ధనుష్ కి ఈ కేసులో ఊరట లభించింది. కదిరేశన్ దంపతులు ఉద్దేశ పూర్వకంగా సింపతీ కోసం తమ కొడుకు ధనుష్ అనే వాదనని తీసుకువచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. 

click me!

Recommended Stories