'దేవర' ఓటిటి డీల్, తెలుగులో ఫస్ట్ టైమ్ ఈ రేటు పలకటం

First Published | Sep 9, 2024, 6:16 AM IST

 Netflix ఓటిటి సంస్ద దేవర ఓటిటి రైట్స్ లాక్ చేసింది. ఈ చిత్రం ఓటిటి డీల్ భారీ రేటుకు క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva, ott


  తెలుగులో రిలీజ్ అయ్యే అతి పెద్ద సినిమాల్లో దేవర ఒకటి.   'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ కూడా క్లోజ్ అయ్యిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లటంతో  భారీగా బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో  ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతోంది. యాక్షన్ మామూలుగా ఉండదని , అరాచకం అని కొరటాల ఎలాగైనా ఇండస్ట్రీ మారుమ్రోగే స్దాయిలో హిట్ కొట్టాలని అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డీల్ భారీ రేటుకు క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.
 


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు Netflix ఓటిటి సంస్ద దేవర ఓటిటి రైట్స్ లాక్ చేసింది. 150 కోట్లు ఇచ్చి ఈ చిత్రం ఓటిటి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇదే హైయిస్ట్ ఓటిటి డీల్.  నెగోషియేషన్స్ త్వరలోనే ఎగ్రిమెంట్ అవుతుందని వినికిడి. భారీ రేటుకు ఓటిటి రైట్స్ వెళ్ళటంతో నిర్మాతలు బడ్జెట్ లో సగం ఇక్కడే రికవరీ అవుతోందని హ్యాపీగా ఉన్నారు. 
 



దేవరచిత్రం ఓటిటి రైట్స్ ఆ స్దాయిలో పలకటానికి కారణం ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించటమే అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. దానికి తోడు దేవర చిత్రంలో జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటంతో ప్యాన్ ఇండియా రీచ్ ఈజిగా అవుతుంది. తెలుగుతో సమానంగా హిందీ వ్యూయర్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకంతో నెట్ ప్లిక్స్ ఉంది.


తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కలిపి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే  నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం రూ.150 కోట్లు ఖర్చుపెట్టిందని సమాచారం.

థియేటర్లలో ‘దేవర’ విడుదల అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కావాలని ఎగ్రిమెంట్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక ఓటీటీ రైట్స్ కోసం రూ.150  కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదని  అభిమానులు చెప్తూ పండగ చేసుకుంటున్నారు. 
 

Junior NTR Devaras advance collection report out


కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్‌ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Actor Junior NTRs Devara film update out

 దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  


  
రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ఆయిన సితార ఎంటెర్టైనమెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ రేట్ కు కొనుగోలు చేసాడు. అలాగే రీసెంట్ గా దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కూడా డీల్ క్లోజ్ చేశారు దేవర నిర్మాతలు. కన్నడ  థియేట్రికల్ రైట్స్ ను   రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసాడు.   

Latest Videos

click me!