నిజంగా బలైపోయిన బేబక్క.. పిచ్చి గొర్రె అని ట్యాగ్ తగిలించి మరీ పంపిచారుగా...

First Published | Sep 9, 2024, 12:18 AM IST

బిగ్ బాస్ హౌస్ లో అసలైన ఎపిసోడ్.. ఎలిమినేషన్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఏసియన్ నెట్ చెప్పినట్టుగానే బేబక్క ఎలిమినేషన్స్ కు బలైపోయింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రాను రాను రసవత్తరంగా మారుతోంది. వీకెండ్ వచ్చేవరకూ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇక డైరెక్ట్ గా ఎలిమినేషన్ విషయానికి వస్తే.. చాలా ఉత్కంఠ తరువాత ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది బేబక్క.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక రకంగా బేబక్క బలైపోయింది అని చెప్పవచ్చు. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచీ.. ఆమెను అంటూనే ఉన్నారు. హౌస్ లో అందరికి వండిపెడుతున్నా.. అందులో కూడా వంకలు పెట్టారు. నామినేషన్స్ లో కూడా అందరు పగబట్టినట్టుగా బేబక్క వెంట పడ్డారు. 


ఈ రోజు  సండే ఫంన్ డే  గేమ్ లో కూడా బేబక్క ను పిచ్చి గొర్రెను చేస్తూ.. అందరు ఆమెకు ట్యాగ్ ఇచ్చారు. అంతే కాదు జోక్ చేసినా కాని.. సండే ఫన్ గేమ్ లో కూడా బేబక్క నన్ను ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు... అని అనడం.. అది నిజం అవ్వడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చిందనే అనాలి. 

బేబక్క కంటే కూడా అక్కడ ఎలిమినేషన్ కు అర్హత ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అందరికి వండిపెడుతూ.. టాస్కుల్లో కూడా యాక్టీవ్ గా పాల్గొంటూ.. అందరితో మాట పడిన మధు నెక్కంటిని హౌస్ లో ఎవరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ఇక ఎలిమినేట్ అయిన తరువాత బేబక్క స్టేజ్ మీదకు వెళ్ళి.. తన అభిప్రాయాలు వెల్లడించింది. హౌస్ లో ఉన్నవారిలో ఎవరు అందులో ఉండటానికి అర్హుల్ కారు అని నాగార్జున్ అడగగా.. బేబి వారి గురించి వెల్లడిస్తూ.. ఒక్కక్రిపేరు మెన్షన్ చేసింది. 

అందులో ముందుగా సోనియా, ఆతరువాత నిఖిల్, పృధ్వీ, మణికంఠల పేర్లు చేర్చింది. సోనియా కు తనంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదని... చాలా మంది ఆమె వల్ల సఫర్ అవుతున్నారు అన్నది. ఇక పృధ్వి కామెంట్లు, మణికంఠ డిప్రెషన్, నిఖిల్ మాట మార్చడం ఇలా చాలా కారణాలతో వారు హౌస్ లో ఉండదగిని వారు కాదు అని చెప్పింది బేబి. 

ఇక హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది. ఇక రేపటి ఎపిసోడ్ లో నామినేషన్ యుద్దం చూడబోతున్నం ఏం జరుగుతుందో చూడాలి. 

Latest Videos

click me!