వైల్డ్ కార్డు ఎంట్రీలు ఊహించని విధంగా.. హౌస్లోకి మాజీ ఫైర్ బ్రాండ్స్, ఇది కదా ట్విస్ట్!

First Published | Sep 14, 2024, 6:01 PM IST

బిగ్ బాస్ షో ఏమంత మజాగా లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలు మరింత గట్టిగా ప్లాన్ చేశారట. ఐదుగురు మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారట. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై దాదాపు రెండు వారాలు అవుతుంది. షో అంత రసవత్తరంగా లేదు. కంటెస్టెంట్స్ అందరూ చప్పగా ఉన్నారు. వీరిలో గేమ్ లేదు, ఫైర్ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ వీక్ టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదట. సెకండ్ వీక్ లో టీఆర్పీ మరింత తగ్గే సూచనలు కలవు. 

షోని రంజుగా మార్చాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్ట్రాంగ్ గా ఉండాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో కొత్త వాళ్ళను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారట. ఈ లిస్ట్ లో హరి తేజ, రోహిణి, శోభా శెట్టి, అవినాష్, టేస్టీ తేజ ఉన్నారట. 


హరి తేజ మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు రాబట్టింది. ముప్పైకి పైగా సినిమాల్లో హరి తేజ నటించింది. హరి తేజ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు 1లో పేరున్న నటులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హరి తేజ 3వ స్థానంలో నిలిచింది. 

Jabardasth Rohini

జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఫేమ్ రాబట్టింది రోహిణి. గతంలో రోహిణి సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు వెండితెరపై సత్తా చాటుతుంది. రోహిణికి కమెడియన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. 

రోహిణి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్ట్ చేసింది. నాగార్జున హోస్ట్ గా మొదటిసారి బాధ్యతలు చేపట్టాడు. రోహిణి హౌస్లో పెద్దగా రాణించలేదు. ఆమె నాలుగవ వారమే ఎలిమినేట్ అయ్యింది. ఉన్నన్ని రోజులు తన మార్క్ గేమ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రోహిణి తిరిగి సీజన్ 8లో కంటెస్ట్ చేయనుందట. 

సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ ఒకడు. అవినాష్ ఆ సీజన్ కి గాను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ గొప్ప ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతడి బాడీ లాంగ్వేజ్, జోక్స్ నవ్వులు పూయించేవి. అవినాష్ అంచనాలకు మించి రాణించాడు. పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 

అగ్రిమెంట్ బ్రేక్ చేసి జబర్దస్త్ నుండి వచ్చేసిన నేపథ్యంలో అతడు ఈటీవీకి దూరమయ్యాడు. చాలా కాలంగా స్టార్ మాకే అతడు పరిమితం అయ్యాడు. ముక్కు అవినాష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది తాజా న్యూస్. 

అత్యంత నెగిటివిటీ తో బయటకు వచ్చిన మాజీ కంటెస్టెంట్ శోభా శెట్టి. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచింది. ఎదురుగా ఎవరున్నా ఆమె తగ్గేది కాదు. ఒక రేంజ్ లో విరుచుకుపడేది. శోభా శెట్టి మాట తీరు, బాడీ లాంగ్వేజ్ వివాదాస్పదం అయ్యాయి. 

శోభా శెట్టిని ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. అయినప్పటికీ శోభా శెట్టి 14 వారాలు హౌస్లో ఉంది. శోభా శెట్టికి మరోసారి అవకాశం దక్కిందని అంటున్నారు. సీజన్ 8లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందట. 
 

సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. శోభా శెట్టి, టేస్టీ తేజ బెస్ట్ ఫ్రెండ్స్. టెస్ట్య్ తేజ 9 వారాలు హౌస్లో ఉండటం విశేషం. టేస్టీ సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందని సమాచారం.

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!