Jr NTR కారు నంబర్ ప్లేట్‌లో కుటుంబ రహస్యం!

First Published | Sep 9, 2024, 4:46 PM IST

జూనియర్ ఎన్‌టిఆర్ కీ కర్ణాటకకు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కన్నడంలో మాట్లాడి అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు ఎన్టీఆర్. ప్రైవేట్ జెట్‌తో సహా పలు ఖరీదైన కార్లు ఎన్టీఆర్ స్వంతం. అయితే ఆయన కారు నెంబర్ ప్లేట్ వెనుక ఒక రహస్యం దాగి ఉంది.  

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రిషబ్ శెట్టితో కలిసి శ్రీ మోక్షంబికా దేవి దేవాలయంతో సహా కర్ణాటకలోని పలు దేవాలయాలను సందర్శించి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రంలోని పాటలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ  క్రమంలో ఎన్టీఆర్ కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు కూడా చర్చనీయాంశంగా మారాయి.

ఎన్టీఆర్ తన కార్ల కోసం ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకుంటారు. 9999 నెంబర్ ప్లేట్ ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైనది. లంబోర్గిని ఉరుస్ కారు కోసం ఈ నంబర్ ప్లేట్‌ను ఏకంగా 17 లక్షల రూపాయలు చెల్లించి వేలంలో దక్కించుకున్నారు.


ఇటీవలే మెర్సిడెస్ బెంజ్ సెడాన్ కారును కొనుగోలు చేశారు ఎన్టీఆర్. అయితే ఈ కారుకు తనకు ఇష్టమైన 9999 నంబర్‌ను వాడలేదు. దానికి బదులుగా 1422 నంబర్ ప్లేట్‌ను ఎంచుకున్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి కారుకూ ఫ్యాన్సీ నంబర్లను వాడే ఎన్టీఆర్, బెంజ్ కారుకు మాత్రం సాధారణ నంబర్ ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ 1422 నంబర్ ప్లేట్ వెనుక ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన ఒక విశేషం ఉంది. ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పుట్టిన తేదీలను కలిపి ఈ నంబర్ ప్లేట్‌ను తీసుకున్నారు. ఈ నంబర్ ప్లేట్‌ను కూడా వేలంలో దక్కించుకున్నారు.  

అభయ్ రామ్ పుట్టిన తేదీ 22 జూలై, 2014. భార్గవ్ రామ్ పుట్టిన తేదీ 14 జూన్, 2018. ఈ రెండు తేదీలనే తన మెర్సిడెస్ బెంజ్ కారు నంబర్ ప్లేట్‌గా మార్చుకున్నారు.

ఎన్టీఆర్ తన ఇద్దరు కుమారులను అమితంగా ప్రేమిస్తారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో అభయ్ రామ్, భార్గవ్ రామ్ సందడి చేశారు. మీడియాను ఎన్టీఆర్ కుమారులు ఆకర్షించారు.  
 

జూనియర్ ఎన్టీఆర్ వద్ద పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. 5 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్, 2 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్, 2 కోట్ల రూపాయల విలువైన BMW, కోటి రూపాయల విలువైన పోర్షే వంటి కార్లు ఉన్నాయి.  

ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ బ్యానర్స్ లో సంయుక్తంగా దేవర నిర్మిస్తున్నారు. దేవర చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.   
 

Latest Videos

click me!