ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకు డైరక్షన్ లో తెలుగు యంగ్ హీరో

First Published | Sep 9, 2024, 4:00 PM IST

దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడు. 

jason sanjay


త‌మిళ స్టార్ ద‌ళ‌ప‌తి విజయ్ కుమారుడు జాసన్‌ సంజయ్ మెగా ఫోన్‌ పట్టనున్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించే తొలి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుండ‌గా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు చెయ్యబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో ఓ విషయం బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), కవిన్ (Kavin)లతో సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలుగు నుంచి ఓ యంగ్ హీరో ఎంపికైనట్లు తెలుస్తోంది.  ఆ హీరో ఎవరు


 ఈ మూవీలో హీరోగా  తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి  ఏఆర్ రెహమాన్ కొడుకు సంగీతం అందించబోతున్నట్లుగా సమాచారం. అతడు కూడా ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఓ ప్రముఖ హీరోయిన్ సందీప్ కు జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం  వైరల్ గా మారడంతో..  మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
 


Jason sanjay


జాస‌న్ సంజ‌య్ ..లండ‌న్‌లో స్క్రీన్ రైటింగ్‌లో  గ్రాడ్యుయేష‌న్ పూర్తిచేశాడు. ఆ త‌ర్వాత కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు. తండ్రి విజ‌య్ హీరోగా న‌టించిన వెట్టైకార‌న్ మూవీలో జాస‌న్ సంజ‌య్ ఓ సాంగ్‌లో మెరిశాడు. హీరోగా ప‌లు ఆఫ‌ర్స్ వ‌చ్చిన డైరెక్ష‌న్‌పై చేయాలనే  జాస‌న్ సంజ‌య్ ఆ ఆఫ‌ర్స్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.  

Jason sanjay


సందీప్ కిషన్ రీసెంట్ గా  ‘రాయన్’ లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి వెనకాడటం లేదు సందీప్ కిషన్.  తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో బైలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో సందీప్‌కిష‌న్ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.
 

Jason sanjay


 యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా జాస‌న్ సంజ‌య్ ఈ సినిమా క‌థ‌ను రాసుకున్న‌ట్లు చెబుతోన్నారు.  త్వ‌ర‌లోనే జాస‌న్ విజ‌య్ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.  అలాగే జాసన్‌ సంజయ్‌ దర్శకత్వం వహించే తొలి చిత్రంలో దుల్కర్‌(Dulquer Salmaan)గెస్ట్ గా చేయనున్నట్టు తమిళ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.  

vijay son


ఇదిలా ఉండగా.. జాసన్ సంజయ్ తండ్రి దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వసూళ్ల పరంగా కూడా విజయ్ అదరగొడుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను అలరిస్తోంది. విడుదలైన మూడో రోజే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.  

Latest Videos

click me!