ఎన్టీఆర్ - విజయ్ దళపతి కాంబోలో క్రేజీ మల్టీ స్టారర్..? డైరెక్టర్ ఎవరు..?

First Published | Dec 16, 2023, 12:35 PM IST

రాజమౌళి అన్ని ఇండస్ట్రీలను కలిపిన తరువాత భాషాబేధం లేకుండా.. అన్ని సినిమాలను ఇండియన్ సినిమాగా పిలుకుంటున్నాం. ఈక్రమంలో స్టార్ హీరోలకు అన్ని భాషల్లో ఇమేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలో కొత్త కొత్త కాంబినేషన్లు.. క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ తెరపైకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఓ స్టార్ కాంబో పై న్యూస్ వైరల్ అవుతోంది. 

తెలుగు,తమిళ స్టార్ల కలయికలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. గతంలో మనహీరోలను తమిళ తంబీలు పెద్దగా ఆదరించలేదు. కాని తమిల హీరోల హవా ఎప్పటి నుంచో టాలీవుడ్ లో వీస్తూనే ఉంది. కాని రాజమౌళి ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తరువాత మనవాళ్ల సత్తా ఏంటో ఇంటర్నేషనల్ లెవల్లో ప్రూ అయ్యింది.  

ఇక ఇప్పుడు స్టార్ హీరోలు కూడా భాషా బేధం లేకుండా.. సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.తమిళ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు. మన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటివారు తమిళంలో కూడా సత్తా చాటుతున్నారు. ఇక ఈక్రమంలో తెలుగు, తమిళ కలయికలో స్టార్ హీరోలయిన ఎన్టీఆర్ - విజయ్ దళపతి కాంబినేషన్ లో సినిమా ప్రపోజల్ తెరపైకి వచ్చింది. 
 


అవును ఈ ఇద్దరు స్టార్లకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఇద్దరికి ఇద్దరు బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసేంత సత్తా ఉన్న హీరోలు. ఏజ్ గ్యాప్ ఓ  10 ఏళ్లు ఉన్నారు.. ఇమేజ్ లో మాత్రం ఒకరికి ఒకరు ఎక్కడా తగ్గేది లేదంటారు. ఈ ఇద్దరు స్టార్లకు తెలుగు,తమిళ ఇండస్ట్రీలు రెండింటిలో మంచి ఇమేజ్ ఉంది. దాంతో వీరి కాంబినేషన్ లో సినిమా చేయాలి అని ప్రయత్నాలు జరిగాయట. 

ஏ ஆர் முருகதாஸ் இந்தியா சினிமாவிலே முதல் முறையாக 100 கோடி வசூல் செய்து சாதனை படைத்தார் அது என்ன படம் என்றால் கஜினி ஹிந்தியில் அமீர் கான் நடித்த படம்

అయితే ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి డిఫరెంట్ థాట్స్ వచ్చే దర్శకుడు అనగానే మురుగదాస్ పేరే వినిపిస్తుంది.  తమిళ దర్శకుడు మురగదాస్ విజయ్ తో ఇప్పటి వారికి తుపాకీ, కత్తి , సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీశాడు. ఆయన వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ తీయాలని చాలా కాలంగా ఆలోచనలో ఉన్నారట. 

రెండు భాషల్లో భారీ బడ్జెట్ తో.. సెపరేట్ గా సినిమాలు చేయాలి అనుకున్నారట.  తెలుగు వెర్షన్ సినిమాలో ఎన్టీఆర్ హీరో, విజయ్ విలన్.  అలాగే తమిళ భాషలో విజయ్ హీరో, ఎన్టీఆర్ విలన్. ఇలా రోల్స్ రివర్స్ చేసి ప్రయోగం చేయాలి అనుకున్నారట మురుగదాస్.  గతంలో ఈ ఫార్ములను మణిరత్నం అప్లే చేసి..సక్సెస్ అయ్యారు. దాంతో మురుగదాస్ కూడా ఈ భారీ కాంబోను ఎలాగైనా సెట్ చేయాలి అని ప్రయత్నం చేశారని తెలుస్తోంది. 

కానీ ఎందుకో ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ స్క్రిప్ట్ ని చెయ్యడానికి సుముఖత చూపలేదు.ఎందుకంటే అప్పట్లో ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం ఉండేది. RRR తర్వాత ఆ భయాలు పోయాయి. భవిష్యత్తులో ఈ క్రేజీ మల్టీస్ట్రారర్ తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.

Latest Videos

click me!