BiggBoss7:బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లీక్.. పక్కా ప్లాన్ తో నాగార్జున ఎలా టెన్షన్ పెట్టారో తెలుసా ?

First Published | Dec 16, 2023, 10:28 AM IST

100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ తెలుగు 7సీజన్ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు.

100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన బిగ్ బాస్ తెలుగు 7సీజన్ ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. హౌస్ లో ఫైనలిస్టులుగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అమర్ దీప్ టైటిల్ కోసం పోరాడుతున్నారు. బిగ్ బాస్ నుంచి అందుతున్న లీకుల ప్రకారం గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా ఆల్రెడీ ముగిసింది. 

ఆదివారం రోజు సాయంత్రం ఫినాలేని ప్రసారం చేయనున్నారు. అంటే ఆల్రెడీ విన్నర్ ఎవరో అనౌన్సమెంట్ జరిగిపోయింది. ఈసారి అత్యంత పకడ్బందీగా బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే షూట్ చేశారట. కొన్ని లీకులు బయటకు వస్తున్నప్పటికీ విన్నర్ ఎవరనే విషయం బయటకి రాకుండా నాగార్జున జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. 


దీనికోసం పక్కా ప్లాన్ అమలు చేసినట్లు టాక్. గత సీజన్స్ లో విన్నర్ ఎవరో షూటింగ్ రోజే తెలిసిపోయేది. మాజీ కంటెస్టెంట్స్ లు షూటింగ్ కి వెళ్లడం వాళ్ళు హింట్స్ ఇవ్వడంతో విజేత ఎవరో తెలిసిపోయేది. కానీ ఈసారి ఫినాలేకి మాజీ కంటెస్టెంట్స్ ని అనుమతించలేదని సమాచారం. గత సీజన్ల అనుభవాల దృష్ట్యా సీజన్ 7లో ముందు నుంచి ఒక ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. 

అందుతున్న మరో సమాచారం మేరకు ప్రతి సీజన్ లో డబ్బు ఉన్న సూట్ కేస్ తో ఫైనలిస్టులని టెంప్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతవరకు మధ్యలోనే సూట్ కేస్ తీసుకుని డ్రాప్ అయిన కంటెస్టెంట్స్ లేరు. ఈ సీజన్ లో ఒక ఫైనలిస్ట్ సూట్ కేస్ తో మిడిల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో సండే వరకు వెయిట్ చేయాల్సిందే. 

Bigg Boss Telugu 7

విజేత ఎవరనేది చివరి నిమిషం వరకు చెప్పలేం అని అంటున్నారు. నాగార్జున పక్కా ప్లాన్ తో విజేత ని అనౌన్స్ చేశారట. లోపల షూట్ లో ఉన్న వారికి తప్ప విజేత ఎవరనే లీక్ బయటకి రాలేదు. 

Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ లలో ఒకరు విజేత అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. వీరిలో ఎవరైనా ఉల్టా పల్టా అన్నట్లుగా సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోతే ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. మరి లోపల ఏం జరిగిందో వేచి చూడాలి. 

Latest Videos

click me!