యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించేశారు. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయింది.
ఈ చిత్రం 1940 బ్రిటిష్ నేపథ్యంలో ఉండబోతోంది అని చిత్ర యూనిట్ కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ ఈ మూవీలో సైనికుడిగా కనిపిస్తారు. అందుకే ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి చిత్రాల్లో కాస్త ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది.
ప్రభాస్ చిత్రం స్వాతంత్ర సమరం నేపథ్యంలో తెరకెక్కుతుండడంతో మరింత ఎమోషనల్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది.. హ్యాపీ ఎండింగ్ ఉంటుందా లేక శాడ్ ఎండింగ్ లో హను ట్విస్ట్ ఇస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఎందుకంటే హను రాఘవపూడి గత చిత్రం సీతారామంలో కూడా హీరో సైనికుడే. కానీ చివర్లో హీరో చనిపోతాడు. ఎమోషనల్ సీన్స్ తో హను కన్నీళ్లు పెట్టించారు.
ప్రభాస్ లాంటి మాస్ హీరోని పెట్టుకుని అలా శాడ్ ఎండింగ్ ఇస్తే ప్రమాదం. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే హను రాఘవపూడి మాత్రం సీతారామం చిత్రం శాడ్ ఎండింగ్ అంటే ఒప్పుకోవడం లేదు. హీరోని బతికించాలని తన టీమ్ ఎంత చెప్పినా హను వినలేదట.
Sitaramam Review
ఎందుకంటే రామ్ అనే వ్యక్తి ఒక అద్భుతం. అలాంటి వ్యక్తిని పాకిస్తాన్ నుంచి తిరిగి తీసుకువస్తే అందరిలాగే సాధారణ వ్యక్తి అవుతాడు. హీరో చనిపోయినప్పటికీ సీతారామం చిత్రం శాడ్ ఎండింగ్ కాదు. ఎందుకంటే కథ ముగిసేది రామ్ రాసిన లెటర్ సీతకి అందుతుందా లేదా అనే అంశంతోనే.. సీతకి లెటర్ అందింది కాబట్టి ఆ చిత్రం హ్యాపీ ఎండింగే అంటూ హను వివరణ ఇచ్చారు. మరి ప్రభాస్ చిత్ర క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో చూడాలి.