ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం..

Published : May 15, 2023, 03:59 PM ISTUpdated : May 15, 2023, 04:02 PM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది.

PREV
16
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం..

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20 కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ ఆహ్వానించారు. 

26

మే 20వ తేదీన హైదరాబాద్‌లో జయహో ఎన్టీఆర్ వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు  సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. 

36

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లిటరేచర్, సావనిర్  అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్‌గా టీడీ జనార్దన్, ఇతర సభ్యులు.. సభ కార్యక్రమాలపై సినీపరిశ్రమ ప్రముఖులతో కూడా సమాలోచనలు నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు కూడా సావనిర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయి చర్చించారు. 

46

ఇక, టీడీ జనార్దన్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు జూనియర్ ఎన్టీఆర్‌తో, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కళ్యాణ చక్రవర్తిలను కలిసి ఆహ్వానం పలికారు. నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలుకుతున్న టీడీ జనార్దన్‌ వెంట నందమూరి రామకృష్ణ కూడా ఉన్నారు. 

56

అయితే గతకొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ, నందమూరి కుటుంబం దూరం పెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పలు సందర్భాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్‌లో జరిగే  ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌‌కు ఆహ్వానం అందడం.. అటు టీడీపీ వర్గాల్లో, ఇటు నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. 

66

ఇదిలా ఉంటే.. గత నెల 28న విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా విడుదల చేసిన ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలా పుస్తకాలను నందమూరి కళ్యాణ్ రామ్‌కు ఇటీవల టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ అందజేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories