ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్ర ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రానికి ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆగష్టు 14 గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ తొలిసారి కలిసి నటించారు. వార్ ప్రాంఛైజీలో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దీనితో వార్ 2 ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షుకులని ఆకట్టుకునే విధంగా ఉందా, థ్రిల్ పంచిందా అనే విషయాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
DID YOU KNOW ?
ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఇదే తొలిసారి
వైఆర్ఎఫ్ సంస్థ వార్ 2 చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించడం ఇదే తొలిసారి.
26
వార్ 2 ట్విట్టర్ రివ్యూ, ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది
జపాన్ లో జరిగే హృతిక్ రోషన్ యాక్షన్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత దర్శకుడు చాలా సేపు డ్రామా నడిపించారు. సినిమా ప్రారంభమైన దాదాపు 40 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంటుంది. ముందుగా ఊహించినట్లుగానే ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
36
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే
ఎన్టీఆర్, హృతిక్ మధ్య పోటా పోటీగా సాగిన సన్నివేశాలే ఈ చిత్రానికి హైలైట్. కొన్ని సన్నివేశాలు అత్యంత ఉత్కంఠకి దారి తీసేలా ఉంటాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో హృతిక్ జపాన్ యాక్షన్ సీన్ ని, ఎన్టీఆర్ ఎంట్రీ సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా డీల్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో రొటీన్ గా అనిపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
కథలో కూడా కొత్తదనం లేదు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అతిగా అనిపిస్తాయి. కానీ ఎన్టీఆర్, హృతిక్ మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చక్కగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 'సలామ్ అనాలి' సాంగ్ ని చాలా బాగా చిత్రీకరించారు. కొందరు ఆడియన్స్ వార్ 2 ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు.
56
విజువల్ ఎఫెక్ట్స్ మైనస్
సినిమా టోగ్రఫీ చాలా వరకు బాగా కుదిరింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం 400 కోట్ల బడ్జెట్ చిత్రానికి ఉండాల్సిన విధంగా లేవని ఆడియన్స్ అంటున్నారు. కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ చిత్రం అన్నట్లుగా సాగుతుంది.
66
ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే
ఇంటర్వెల్ బ్యాంగ్ ని మంచి ట్విస్ట్ తో ఎండ్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ పెంచుతాడు అనుకుంటే అలా చేయలేదు. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ మాత్రమే ఫ్యాన్స్ కి వర్కౌట్ అయ్యే సీన్స్ పెట్టారు. యాక్షన్ సీన్స్ కోసం ఎన్టీఆర్, హృతిక్ పడ్డ కష్టం అర్థం అవుతోంది. ఎమోషనల్ సీన్స్ యావరేజ్ గా అనిపిస్తాయి. చాలా చోట్ల డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సేఫ్ గేమ్ ఆడారు. దీనితో వార్ 2 చిత్రం నెక్స్ట్ లెవల్ మూవీ కాకుండా యావరేజ్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.