Rajinikanth: రజినీకాంత్ యాక్టింగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజినీ గురించి నెగిటివ్‌గా మాట్లాడాడంటూ ఆయన ఫ్యాన్స్ అంతా ఆర్జీవీపై ఫైర్ అవుతున్నారు.
Ram Gopal Varma unsure if Rajinikanth is a good actor in telugu
తన కొత్త సినిమా ప్రమోషన్ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఏదో కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తూంటారు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘శారీ’ ప్రమోషన్స్ చేస్తున్నారు ఆర్జీవీ. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. బాలీవుడ్ గురించి, పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ...ఎప్పటిలాగే ఓ వివాదాస్పద కామెంట్ ని తన ఇంటర్వూలో చేసారు.
అది మరేదో కాదు రజినీకాంత్ యాక్టింగ్ గురించి . రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ పై ఆయన కామెంట్ చేయటంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫర్ అయ్యింది. అదే వర్మకు కావాల్సింది. పనిలో పనిగా తన సినిమా గురించి ప్రస్తావిస్తారని ఆయనకు తెలుసు. ఇంతకీ రజినీ గురించి నెగిటివ్‌గా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడారో చూద్దాం.
23
Ram Gopal Varma unsure if Rajinikanth is a good actor in telugu
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ‘‘యాక్టింగ్ అనేది క్యారెక్టర్‌కు సంబంధించిన విషయం. పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి స్టార్లు పుడతారు. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. రజినీకాంత్ మంచి యాక్టరా అని అడిగితే నాకు తెలియదు అనే అంటాను. రజినీకాంత్ సత్య లాంటి సినిమాను చేయలేకపోవచ్చు. ఆయనను ఇలాగే చూడాలని అందరూ అనుకుంటారు. అసలు స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ (Rajinikanth) లేడు.
ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్‌లో నడిచినా అది చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. అదే ఒక ఆనందాన్ని ఇస్తుంది’’ అంటూ రజినీకాంత్ యాక్టింగ్ గురించి మాట్లాడాడు రామ్ గోపాల్ వర్మ. అది రజనిపై పొగడ్తా లేక విమర్శా అని కొందరు తల పట్టుకుంటూంటే మరికొందరు ఇది ఖచ్చితంగా రజనీపై నెగిటివ్ కామెంటే అంటున్నారు.
33
Ram Gopal Varma unsure if Rajinikanth is a good actor in telugu
అలాగే ‘‘ఒక స్టార్ అనేవాడు మామూలు పాత్ర పోషిస్తే ప్రేక్షకులకు అస్సలు నచ్చదు. అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలోని సీన్‌లో కడుపునొప్పితో బాధపడుతుంటాడు. వాళ్లను స్టార్లుగా చూస్తాం కాబట్టి అలాంటి పాత్రలు ప్రేక్షకులకు నచ్చవు’’ అని వివరించాడు
రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లోకి కొత్త రకం దర్శకులు వచ్చారు. వాళ్లు బాంద్రా లాంటి కాస్ట్‌లీ ఏరియాల్లో జీవితం కొనసాగిస్తూ హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తూ వాటినే చూస్తుంటారు. అలాగే హాలీవుడ్ స్టైల్‌లోనే సినిమాలు కూడా తెరకెక్కిస్తారు. పుష్ప 2 లాంటి చిత్రాలను తెరకెక్కించే సత్తా బాలీవుడ్ మేకర్స్‌కు ఉన్నా కూడా వారు అది చేయడం లేదు.’’ అంటూ బీ టౌన్‌లోని నేటితరం డైరెక్టర్స్‌పై కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).